కబడ్డీ పోటీలకు పటిష్ట భద్రత చర్యలు చేపట్టండి-ఎమ్మెల్యే భూమన.
* 4 న క్రాకెర్స్ షో
తిరుపతి ముచ్చట్లు:
జనవరి 5 నుండి 9 వరకు తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. కబడ్డీ పోటీల నిర్వహణలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపైఆదివారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ డాక్టర్ శిరీషా, ఎస్పీ అప్పలనాయుడు, కమిషనర్ గిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ పోలీస్ అధికారులతో సమావేశమై సమీక్షించారు. సమావేశం అనంతరం క్రీడా ప్రాంగణం ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కబడ్డీ పోటీల వలన ప్రజలకు, క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. వాహనాల పార్కింగ్, వీక్షకులు, క్రీడాకారులు వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. క్రీడా ప్రాంగణంలో బోజనసాల, రెఫరీ పాయింట్, మీడియా పాయింట్, ప్రథమ చికిత్స కేంద్రం, వీక్షకుల గాలరీ ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఎస్పీ వెంకట అప్పల నాయుడు మాట్లాడుతూ వాహన చోదకులకు ఇబ్బంది లేకుండా టి.ఎం.ఆర్. కూడలి, గంగమ్మ ఆలయం కూడలి, సెంట్రల్ పార్క్ కూడలి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడా ప్రాంగణం వైపు ఎటువంటి వాహనాలు రాకుండా పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. మరోమారు అన్ని మార్గాలను పరిశీలించి ట్రాఫిక్ మల్లింపు మార్గాలకు ప్రజలకు తెలిసేలా అన్ని చర్యలు చేపడతామన్నారు. నగరపాలక సంస్థ ఆవరణంలో వాహనాల పార్కింగ్ స్థలం వినియోగించుకోవాలని కమిషనర్ గిరీషా అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ హరిత, ఏ ఎస్పీ సుప్రజ, డి.ఎస్పీ లు మురళీకృష్ణ, కాటంరాజు, నరసప్ప, తదితరులు పాల్గొన్నారు.
కబడ్డీ పోటీల టీ షర్ట్ ఆవిష్కరణ
కబడ్డీ పోటీల్లో క్రీడాకారులు ధరించనున్న టీ షర్ట్ లను ఆదివారం స్థానిక లలిత కళా ప్రాంగణంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషా, ఎస్పీ వెంకట అప్పలనాయుడు, కమిషనర్ గిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అదనపు కమిషనర్ హరిత, కార్పొరేటర్లు, ఆవిష్కరించారు. టీ షర్ట్స్ విరాళంగా అందించిన బంధన్ సంస్థ అధినేత బాలాజీ ని అభినందించారు.
4 న భారీ ఎత్తున క్రాకెర్స్ షో..
జాతీయస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ సూచికగా 4 వ తేదీ సాయంత్రం వై.ఎస్.ఆర్. కూడలి వద్ద భారీ ఎత్తిన బాణాసంచా కాల్చే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే భూమన.కరుణాకర్ రెడ్డి తెలిపారు.జనవరి 5 నుండి 9 వ తేదీ వరకు కబడ్డీ పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి నాందిగా 4 వతేదీ సాయంత్రం 6 గంటలకు ఇందిరామైదానం వద్ద క్రాకెర్స్ షో చేస్తున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల పోటీలకు ముందు నిర్వహించే విధంగా చాలా చాలా పెద్ద స్థాయిలో ఈ క్రాకెర్స్ షో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలందరూ 4 వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు విచ్చేసి అద్భుతమైన క్రాకెర్స్ షో ను వీక్షించాలని కోరారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Take strong security measures for kabaddi competitions-MLA Bhumana.