నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరుస్తాం

Take the gravestones into the public and motivate them

Date:23/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పేద ప్రజల అభివృద్ధి కోసం నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి , పార్టీని పటిష్ట పరుస్తామని నియోజకవర్గ బూత్‌ కమిటి మేనేజర్‌ రెడ్డెప్ప , కో-ఆఫ్షన్‌మెంబర్‌ ఖాదర్‌బాషా తెలిపారు. శుక్రవారం మండలంలోని నెక్కుంది, చిన్నఅలసాపురం, అలసాపురం హరిజనవాడ గ్రామాల్లో నవరత్నాల కార్యక్రమాన్ని ఇంటింటా ప్రచారం చేసి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , మాజీ ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి సూచనల మేరకు ప్రతి రోజు నవరత్నాలు కార్యక్రమాలను గ్రామాల్లో వివరిస్తున్నామన్నారు. ఇలాంటి మహాత్తర కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు కంకణబద్దులైన వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరు వైఎస్‌ఆర్‌సిపికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ నారాయణరెడ్డి, సహాదేవ, రెడ్డెప్ప, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

వ్యాదులపట్ల జాగ్రత్తలు వహించండి

Tags; Take the gravestones into the public and motivate them

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *