నరేగా పనులు రైతులకు ఉపయోగపడేలా చేపట్టండి జగనన్న పచ్చతోరణం చిత్తూరు జిల్లా ఆదర్శంగా నిలవాలి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి

తిరుపతి ముచ్చట్లు:

జగనన్న పచ్చతోరణం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యత కార్యక్రమం, గత సంవత్సరం ప్రారంభించామని 2021- 22 లో నరేగాలో ప్రాధాన్యత నిఛ్చి చిత్తూరు జిల్లాకు ఆదర్శంగా నిలపాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు.శనివారం ఉదయం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో 2021.22లో అమలు చేయనున్న జగనన్న పచ్చ తోరణం కార్యాచరణ అమలు పై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, నరేగా డైరెక్టర్ చిన తాతయ్య, స్టేట్ కౌన్సిల్ మెంబర్ విశ్వనాద్ నరేగా అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మాట్లాడుతూ నరేగాలో చేపట్టే ప్రతి పని రైతులకు పూర్తిగా ఉపయోగపడేలా ఉండాలని, 2021.22లో ప్రణాళిక మేరకు రాష్ట్రంలో 26,000 కిమీ గుర్తించి జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్ రహదారుల వెంబడి, రైల్వే ట్రాక్ వెంబడి మొక్కల పెంపకం జరగాలని నాటే ప్రతిమొక్క కనీసం 6 అడుగులు పై బడి వుండేలా చూడాలని అన్నారు.  గతంలో లాగా నాటి వదిలేయకుండా భాద్యత అప్పజెప్పాలని, అందు కోసం 3 సంవత్సరాల పాటు కాపాడేందుకు, నీటిని పోసేందుకు రైతుల నుండి టాంకర్లు గుర్తించి అప్పజెప్పాలని అన్నారు. గతంలో మొక్కల పెంపకంలో సర్పంచులు భాద్యత జి.ఓ.ఇచ్చామని గుర్తుచేశారు. దీనితోపాటు వర్షాభావ ప్రాంతాల్లో రైతులకు పండ్లతోటల పెంపకం లక్ష ఎకరాల ప్రణాళిక , ఫ్లోరీ కల్చర్ 1000 ఎకరాలు పూర్తి కావాలని అన్నారు. సోషల్ ఫారెస్టరీ 6 అడుగుల మొక్కలు పంపిణీ చేయకుంటే బయటి నుండి కొనుగోలు చేయాలని అన్నారు. అలాగే జగనన్న కాలనీల్లో ఇళ్ళు పూర్తియైన చోట ముఖ్యమంత్రి కి డిప్యూటీ సి. ఎం.నారాయణ స్వామి సూచించిన విధంగా కొబ్బరి చెట్లు అందించాలని అన్నారు. ప్రణాళిక పూర్తి స్థాయిలో అమలు చేసి జిల్లా ఆదర్శంగా నిలపాలని, డ్వామా పి.డి. మరో 3 నెలల్లో కడపజిల్లా లో అమలుకు మన మోడల్ సిద్ధంచేయలని అన్నారు.

పుంగనూరు నియోజకవర్గ పరిధిలో 100 రోజుల పైలెట్ ప్రాజెక్టు

మంత్రి మాట్లాడుతూ రిటైర్డు అధికారి చంద్రశేఖర్ రెడ్డి ప్రతి నీటి బొట్టు ఒడిసి పట్టేలా ప్రాజెక్టు రూపొందించారని, క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు ఉపయోగపడేలా చెరువుల మరమ్మత్తు, కాలువల రిపేర్లు, చెట్ల పెంపకం వంటివి 100 రోజుల ప్రాజెక్టు అమలు చేయాలని ఫలితాల మేరకు తదుపరి అమలుకు చేసే విధానం పరిశీలనకు బాగుంటుందని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నరేగా లో ప్రతి పని మంత్రి గారు సూచించిన విధంగా రైతుకు మేలుకలిగేలా అమలు చేయాలని అధికారులకు సూచించారు. నరేగా స్టేట్ డైరెక్టర్ చిన తాతయ్య రాష్ట్ర స్థాయిలో అమలు చేయనున్న జగనన్న పచ్చతోరణం పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో వివరించారు.ఈ సమీక్ష లో పి.డి. డ్వా మా చంద్రశేఖర్, జడ్ పి సీఈవో ప్రభాకర రెడ్డి, డీపీఓ, డిఎఫ్ ఓ,ఆర్ డబ్ల్యూ ఎస్ ,పీఆర్  ,ఆర్అండ్  బి,ఇరిగేషన్  శాఖల ఎస్ ఈ లు,సాంఘీక సంక్షేమం శాఖ ల అధికారులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Take things in stride and try not focus too much on the problem
Jagannath Pachatoranam Chittoor district should stand as an ideal
Minister of Panchayati Raj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *