రోడ్ల మరమ్మతులు చేపట్టండి-జనసేన నాయకులు డిమాండ్

అల్లూరి సీతారామరాజు ముచ్చట్లు:

 

రెండవ రోజు గుడ్ మార్నింగ్ సియం సార్ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పిలుపుమేరకు డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా   అరకులోయ టౌన్షిప్ లో గల ప్రధాన రహదారి  ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద  రోడ్ల గుంతలు వద్ద జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా  దురియ.మండల అధ్యక్ష కార్యదర్శులు అల్లంగి రామకృష్ణ. ఆధ్వర్యంలో రోడ్ల గుంతలు  పరిశీలించారు.   మాట్లాడుతూ అరకు రోడ్లు సుందరంగా  కానరాకపోవడం గమనార్హమని విమర్శించారు అరకులోయ పరిధిలోనే  రోడ్ల గుంతలు ఇలా  అధ్వాన్నంగా ఉంటే  మారుమూల ప్రాంతాలలో గల గిరిజన గ్రామాలలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని విచారం వ్యక్తం చేశారు రోడ్లు గుంతలు గుంతలు గా అధ్వాన్నంగా తయారవ్వడంతో స్థానిక వాసులు,పర్యాటకులు   తరచు ప్రమాదాలు జరుగుతుందని  పేర్కొన్నారు.గత నెల నిర్వహించిన మున్సిపల్ అధికారుల సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో ఉన్న రోడ్ల గుంతలు జూలై 15 కల్లా పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలని అన్నారు  అరకు పట్టణంలో గల రోడ్ల గుంతలు స్థానిక ప్రజలకు, పర్యాటకులకు,వాహన చోదకులకు కష్టాలు తప్పడం లేదు  ఉన్నతాధికారులు దృష్టి సారించి రోడ్ల మరమ్మతులు చేపట్టి ప్రజలకు,పర్యాటకులకు రవాణా కష్టాలు తీర్చాలని  జనసేన పార్టీ డిమాండ్ చేశారు.

 

Tags: Take up road repairs- Jana Sena leaders demand

Leave A Reply

Your email address will not be published.