సివిల్స్ సాధకులకు తక్షశిల ఉచిత శిక్షణ

తక్షశిల నేతృత్వంలో 26న స్కాలర్ షిప్ టెస్ట్
విజయవాడ, విశాఖ, హైదరాబాద్ కేంద్రాలలో ప్రవేశాలు
విజయవాడ ముచ్చట్లు:

సివిల్స్ సాధనే లక్ష్యంగా విద్యాభ్యాసం సాగించాలనుకుంటున్న వారి కోసం తక్షశిల ఐఏఎస్ అకాడమీ నేతృత్వంలో అర కోటి రూపాయల విలువైన ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు సంస్థ వ్యవస్దాపక డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎన్ దుర్గాప్రసాద్ , అకడమిక్ డైరెక్టర్, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎన్. నాగేశ్వరరావు తెలిపారు. సంస్థ బెంజిసర్కిల్ క్యాంపస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్కాలర్ షిప్ అండ్ రివార్డ్ ఎగ్జామ్ (స్కోర్) పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం వివరాలను అందించారు.  స్థాపించిన 6 సంవత్సరాలలో 9 ర్యాంకులు కైవసం చేసుకున్న  తమ సంస్థ సామాజిక సేవా దృక్పథంతో ఉపకారవేతనాలను అందిచే స్కోర్ కు శ్రీకారం చుట్టిందన్నారు. తక్షశిల వ్యవస్ధాపకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే తమ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ఆర్ విద్యోన్నతి కోసం గుర్తింపు పొందిన ఏకైక విద్యాసంస్థగా ఉందన్నారు. ఉపకారవేతనాల కార్యక్రమంలో భాగంగా తాము రాష్ట్రంలోని విజయవాడ , విశాఖపట్నం , హైదరాబాద్ క్యాంపస్ ల కోసం ఈనెల 26వ తేదీన  ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నామని వివరించారు.

 

పదవ తరగతి మొదటి శ్రేణిలో  ఉత్తీర్ణత సాధించినవారు ఇంటర్మీడియట్, డిగ్రీ, సివిల్స్ శిక్షణతో కలిపి ఆరు సంవత్సరాల  ఉచిత శిక్షణ కోసం ఈ ప్రవేశ పరీక్ష రాయవలసి ఉంటుందన్నారు. అదే క్రమంలో ఇంటర్ పూర్తి చేసిన వారు డిగ్రీ ప్లస్ సివిల్స్  నాలుగు సంవత్సరాల శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష రాయాలని, ఈ రెండు స్థాయిలలో ఉచిత  శిక్షణను అందించాలని తక్షశిల ఐఏఎస్ అకాడమీ నిర్ణయించిందని దుర్గాప్రసాద్ తెలిపారు. తాము నిర్వహించే ఎంట్రన్స్ లో ఇంటర్, డిగ్రీ విభాగాలకు సంబంధించి వేరు వేరుగా తొలి మూడు స్థానాల్లో ఉన్న వారికి తాము పూర్తి ఉచిత బోధన అందిస్తామన్నారు. తదుపరి దశలో 4 నుండి 12 ర్యాంకులు సాధించిన వారికి 50 శాతం రాయితీ అందిస్తామని,  13 నుండి 25 ర్యాంకులు పొందిన వారికి 25 శాతం ఫీజు రాయితీ వర్తిస్తుందని అకడమిక్ డైరెక్టర్  డాక్టర్ నాగేశ్వర రావు వివరించారు.  ఈ ఉపకార వేతనాలకు  సంబంధించి దాదాపు 50 లక్షల రూపాయలకు పైగా వ్యయం చేస్తున్నామని డాక్టర్ దుర్గాప్రసాద్ వివరించారు. పరీక్ష ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని, ఈ నెల 25వ తేదీ లోపు ఆన్ లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఇందుకు తక్షశిల ఐఏఎస్ అకాడమీ వెబ్ సైట్ సిద్దంగా ఉందని డాక్టర్ నాగేశ్వర రావు తెలిపారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Takshasila free training for civil practitioners

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *