తలమానికంలా టిట్కో గృహాలు- మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌ల కృషి
– ఒకొక్క ఇంటి విలువ రూ. 15 లక్షలు
-13న గృహ ప్రవేశాలు
పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర చరిత్రలో ఎన్నడులేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 27 పట్టణాల్లో టిట్కో గృహాలు నిర్మించి 53,112 మందికి గృహాలను కేటాయించారు. అందులో భాగంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమ్యిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గ కేంద్రంలో 1536 ఇండ్లను అత్యంత సుందరంగా నిర్మించారు. గృహప్రవేశాలు ఈనెల 13న మంత్రి పెద్దిరెడ్డి, కలెక్టర్ షన్మోహన్ ల చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణాలు…
పట్టణ సమీపంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వెనుక భాగంలో టిట్కో గృహాలను సుమారు రూ.10 కోట్లు విలువ చేసే 5 ఎకరాల భూమిలో 1536 గృహాలు నిర్మించారు. ఇందు కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.99.49 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇండ్ల నిర్మాణాలను ఎంతో నాణ్యత ప్రమాణాలతో నిర్మించారు. 30 అడుగుల వెడల్పు గల సిమెంటు రోడ్లు, కాలువలు నిర్మించారు. అలాగే ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారా పైపులైన్లు వేసి ఇంటింటికి నీరు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి వద్ద టిట్కో ఇండ్లకు సిమెంటు రోడ్డు వేసి ఆర్చి నిర్మించారు. రోడ్లకు ఇరువైపులా వెహోక్కలు నాటి జగనన్న పచ్చతోరణం ఏర్పాటు చేశారు. టిట్కో కాలనీ ప్రాంతంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో సుందర పట్టణంగా రూపాంతరం చెందింది.
అంతా ఉచితం…
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిట్కో లభ్ధిదారుల వద్ద నుంచి ఒకొక్కరి వద్ద రూ.2.65 లక్షలు వసూలు చేసేలా విడుదల చేసిన జీవో 58ను రద్దు చేశారు. అంతా ఉచితంగా ప్రజలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించి నిర్మాణాలను చేపట్టారు. ప్రస్తుతం లభ్ధిదారులు ఒక్కరూపాయి కూడ చెల్లించకుండ సుమారు రూ.15 లక్షలు విలువ చేసే ఇల్లు , స్థలాన్ని రిజిస్ట్రర్ చేసి లభ్దిదారుల పేరున ఇస్తుండటంతో లబ్దిదారుల ఆనందాలకు అవదులు లేకుండ పోయింది. రాష్ట్రంలో ఏముఖ్యమంత్రి చేయని విధంగా జగనన్నపాలనలో ప్రతి ఒక్కరికి పక్కాగృహాలు నిర్మిస్తున్నారని లబ్ధిదారులు చర్చించుకుంటున్నారు.
ఏర్పాట్లు….
టిట్కో గృహా ప్రవేశాలు ఈనెల 13న వైభవంగా నిర్వహించేందుకు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి, చైర్మన్ అలీమ్‌బాషా, రాష్ట్రజానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. టిట్కో గృహాలకు విద్యుత్ బల్భులు ఏర్పాటు చేసి, మామిడి తోరణాలు , పూలు కడుతున్నారు. అలాగే లబ్దిదారు కుటుంబ సభ్యులు వెహోత్తం గృహ ప్రవేశానికి హాజరై నూతన గృహాల్లో పాలుపొంగించే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు సుమారు 6 వేల మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు.
అందరికి పక్కా ఇల్లు …
ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాల మేరకు ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో టిట్కో ఇండ్లు , జగనన్న కాలనీలు మంజూరు చేశాం. తెలుగుదేశం ప్రభుత్వంలో నామమాత్రంగా ఇండ్లు కేటాయించారు. ప్రస్తుతం సుమారు రూ.10 లక్షలు విలువ చేసే స్థలంతో పాటు రూ.5 లక్షలతో నిర్మించిన ఇండ్లు పంపిణీ చేయడం చరిత్రలో సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. మహిళల కష్టాలు చూసి పేదరికమే ప్రామానికంగా ఇండ్లు కేటాయించాం. నియోజకవర్గ ప్రజల అభివృద్ధే మా కుటుంబ లక్ష్యం.
– రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
రూపురేఖలు మార్చుతాం….
నియోజకవర్గ ప్రజలు ఎంతో ప్రేమతో మాకుటుంభానికి అండగా ఉన్నారు. అలాంటి వారి అభివృద్ధే మా లక్ష్యం. నియోజకవర్గ ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం వారి సమస్యలను పరిష్కరించడంలో మాకుటుంబం ఎల్లప్పుడు అండగా ఉంటాం. జగనన్న ఆశీస్సులతో పుంగనూరు నియోజకవర్గ రూపురేఖలు మార్చుతాం. రాష్ట్రంలో పుంగనూరుకు గుర్తింపు తీసుకొస్తాం.
– పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట.
రుణపడి ఉన్నాం….
పట్టణ ప్రజల కోసం లక్షలాది రూపాయలు విలువ చేసే స్థలంలో పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి , మంత్రి కుటుంభానికి రుణపడి ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా ప్రజలు, పట్టణం అభివృద్ధికి నోచుకోలేదు. నాలుగేళ్లలో మంత్రి పెద్దిరెడ్డి పట్టణాన్ని, ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– అలీమ్‌బాషా, మున్సిపల్ చైర్మన్.
Tags: Talamaniklamla TITCO houses – Minister Peddireddy and MP Midhun’s efforts
