Natyam ad

కిట్ నుంచి టాల్కమ్ పౌడర్ ఔట్

కరీంనగర్ ముచ్చట్లు:


కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో శిశు మరణాల రేటును తగ్గించాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ పేరుతో ఓ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రసవం అనంతరం మహిళలకు, వారి పిల్లలకు కావాల్సిన 16 రకాల ఐటమ్‌లను తెలంగాణ ప్రభుత్వం ఓ కిట్ రూపంలో బాలింతలకు అందజేస్తోంది. అయితే ఈ కిట్‌లో అందిస్తున్న ఓ కీలకమైన ప్రొడక్ట్ విషయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తర్జనబర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కిట్‌లో ఓ ప్రముఖ కంపెనీకి చెందిన టాల్కమ్ పౌడర్ అందిస్తున్నారు. అయితే సదరు కంపెనీ ఉత్పత్తి చేస్తున్న టాల్కమ్ పౌడర్ పై ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వివాదం నెలకొంది. క్యాన్సర్‌కు కారణం అవుతోందని సదరు కంపెనీ ఉత్పత్తి చేస్తున్న టాల్కమ్ పౌడర్‌పై అంతర్జాతీయంగా పలు దేశాల్లో నిషేధం కొనసాగుతోంది.అంతర్జాతీయం వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అమెరికాకు చెందిన సదరు కంపెనీ 2023 నుంచి తామ సంస్థ టాల్కమ్ పౌడర్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది.

 

 

కేసీఆర్ కిట్‌లో అందిస్తున్న ప్రొడక్టుల్లో ఈ సంస్థకు చెందిన ఉత్పత్తులే అధికంగా అందజేస్తుండగా టాల్కమ్ పౌడర్ విషయంలో అధికారులు ఆలోచనల్లో పడ్డట్లు తెలుస్తోంది. కేసీఆర్ కిట్‌లో ఈ టాల్కమ్ పౌడర్‌ను ఉంచాలా లేదా అనేదానిపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు కసరత్తు జరుపుతున్నట్లు తెలుస్తోది. అయితే ఈ టాల్కమ్ పౌడర్ విషయంలో జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాలని ఆ తర్వాతే కేసీఆర్ కిట్‌లో సదరు ప్రొడక్ట్ ఉంచాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవచ్చనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తం అయినట్లు తెలుస్తోంది.రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచడంతో పాటు శిశుమరణాల రేటును తగ్గించే ఉద్దేశంతో 2017 జూన్ 2న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ స్కీమ్‌ను లాంచ్ చేశారు. ఈ కిట్‌లో 16 రకాల ఐటమ్స్‌ను అందజేస్తున్నారు. శిశువుకు ఉపయోగపడే బేబీ సోపులు, బట్టలు, డైపర్లు, నాప్కిన్స్, దోమల తెర, బేబీ పౌడర్, బేజీ ఆయిల్ వంటి వస్తువులు అందజేస్తున్నారు. అయితే ఈ వస్తువులన్నింటిలోనూ టాల్కమ్ పౌడర్ విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

 

Post Midle

Tags:Talcum powder out of the kit

Post Midle

Leave A Reply

Your email address will not be published.