వి.యస్.యస్.ఎఫ్ నేషనల్ ఒలింపియాడ్ లో పారమిత విద్యార్థుల ప్రతిభ

కరీంనగర్  ముచ్చట్లు:
విక్రమ్ సారాభాయి సైన్స్ ఫౌండేషన్,తిరువనంతపురం వారి సారథ్యంలో జనవరి 2022 లో ఆన్లైన్ లో  జరిగిన స్పాట్ 100 ఒలంపియాడ్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన 8 మంది పారమిత హెరిటేజ్ విద్యార్థులు  24 ఫిబ్రవరి 2022 న జరగబోయే నేషనల్ లెవల్ స్పాట్  100 ఒలంపియాడ్ పరీక్షకు ఎంపికయ్యారు. ఎంపికయిన విద్యార్థులలో 6 వ తరగతికి చెందిన జి.మహేష్ , వి.అభిరాం, కె.విశ్వతేజ , 7 వ తరగతికి చెందిన టి.రిషిక, యమ్.యషీశ్వర్ ,రాహిల్ మరియు 9 వ తరగతికి చెందిన టి.చిన్మయి ,10 వ తరగతికి చెందిన వి.ప్రీతమ్ ఉన్నారు.ఈ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు దేశంలోని సుప్రసిద్ధమైన సైంటిస్టులు తర్పీదు ను ఇస్తారు. ఈ సందర్భంగా ఒలింపియాడ్ లో ప్రతిభ చూపిన విద్యార్థులను పాఠశాలల చైర్మన్ డా  ఇ.ప్రసాదరావు  ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ రశ్మిత,ప్రసూన, రాకేశ్,వినోద్ రావు,అనూకర్ రావు , వియుఎం  ప్రసాద్ ,  ప్రిన్సిపాల్ సంజయ్ భట్టాచార్య , ఎస్వొడి గోపీకృష్ణ  , వైస్ ప్రిన్సిపాల్ బాలాజీ ,సమన్వయకర్తలు  లక్ష్మిదీప్తి, శిరీష, వి.యస్.యస్.ఎఫ్ పాఠశాల సమన్వయకర్త లలిత్ మోహన్ సాహు ,  ఉపాధ్యాయులు , తదితరులు  పాల్గొన్నారు.
 
Tags: Talented students’ talents at the VSSF National Olympiad