తెలుగుదేశంకు చరమగీతం పలకాలి

Talk to the tale of the Telugu Desam

Talk to the tale of the Telugu Desam

– ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Date:06/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

అవినీతి అక్రమాలలో కూరుకుపోయిన తెలుగుదేశం ప్రభుత్వానికి చరమగీతం పలకాలని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన పట్టణంలోని పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అన్ని వర్గాలను మోసం చేయడమే అజెండాగా మార్చుకుని, పరిపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టులోను , సంక్షేమ పథకాలలోను అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు. ఏ పథకం ప్రజలకు అందడం లేదన్నారు. ఏ వర్గంవారు సంతోషంగా లేరన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు చేరుతోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహ్గదా కోసం బిజెపి ప్రభుత్వంతో కలిశామని చెప్పుకుని, ప్యాకేజిలతో పబ్బంగడిపిన చంద్రబాబునాయుడు నేడు ప్రత్యేకహ్గదా కావాలంటు డిమాండులు చేయడం హాస్యాస్పదమన్నారు. అమరావతి నిర్మాణం పేరుతో వేలాది ఎకరాలు స్వాధీనం చేసుకుని, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు సిపిఎస్‌ను రద్దు చేయకుండ , వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని నామమాత్రంగా నిరుద్యోగులను మరోసారి మోసగించేందుకు ప్రతి నియోజకవర్గంలోను వందల మందికి మాత్రమే ఇస్తున్నారన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఎప్పుడు ఇస్తారంటు నిలధీశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాలిస్తామని ప్రకటనలు ఇవ్వడం బాధకరమన్నారు. ఎన్నికల పక్రియలో నోటిఫికేషన్లు ఆగిపోతుందని తెలిసి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసపూరిత చర్యలు చేపడుతున్నారన్నారు. డ్వాక్రా రుణాల రద్దు, రైతుల రుణమాఫి గంగలో కలిసిపోయిందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు మరో అవతారం ఎత్తి, ఎన్నికల్లో ప్రజలను డబ్బులతో భయబ్రాంతులకు గురి చేసి, అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఎత్తుగడ వేశారని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పేదలకు అందజేసేందుకు వైఎస్‌ఆర్‌సిపికి అధికారం ఇవ్వాలన్నారు. వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పాదయాత్రలో వచ్చిన అన్ని సమస్యలను సత్వరం పరిష్కరించి, ప్రజల ప్రభుత్వంగా నిలుస్తుందన్నారు. ఈమావేశంలో వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, నాగరాజారెడ్డి, వైఎస్‌ఆర్‌ ఆర్టీసి మజ్ధూర్‌ సంఘ అధ్యక్షుడు జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

10 నుంచి రెండో బ్రహ్మోత్సవాలు

Tags: Talk to the tale of the Telugu Desam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed