చంద్రబాబు లేఖలపై చర్చలు జరగాలి

Talks on Chandrababu should be held

Talks on Chandrababu should be held

-బీజేపీకి  జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు
Date:23/11/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
తెలంగాణ అభివృద్దికి, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలపై చర్చలు జరగాలని, వాటిపై కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయడు, మహాకూటమిపై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యతిరేకులకు కోవర్టుగా మారిందన్నారు. టీడీపీ తెలంగాణ ధోఖా పార్టీ అంటూ అభివర్ణించారు. ‘తెలంగాణలో చంద్ర గ్రహణం రాకూడదు. ఫలితాలను చంద్రబాబు నిర్దేశించాలనుకుంటారు. కానీ తెలంగాణలో ఆయన నిర్దేశించే రాజకీయాలు రావు, రాకూడదు. చంద్రబాబు ముక్త్‌ తెలంగాణ కావాలి, చంద్రబాబు లేని రాజకీయాలు మాత్రమే ఉండాలి. తెలంగాణ ప్రజలను ఒంటిరిగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్‌ మహా కూటమి తయారు చేసింది. కాంగ్రెస్‌ నేతలను బెంగళూరు, ఢిల్లీలో కలిసిన చంద్రబాబు.. తెలంగాణలో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో వారితో ఎందుకు పాల్గొనడం లేదు.
నరేంద్ర మోదీ సర్కార్‌ తెలంగాణకు ఇచ్చిన నిధులను ప్రజలకు వివరిస్తాము. తెలంగాణలో మోదీ, అమిత్‌ షా విస్తృతంగా పర్యటన చేస్తారు. జాతీయ ముఖ్య నేతలతో వందకు పైగా సభలు నిర్వహిస్తున్నాము. దక్షిణాది విస్తరణకు, 2019 లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే బీజేపీకి నాంది అని పేర్కొన్నారు.మత ఆధారిత రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పటికీ వ్యతిరేకమే. నిజాం గులాంగిరిని, ఖాసీం రజ్వీ రాజకీయాలను బీజేపీ వ్యతిరేకిస్తోంది. టీఆర్‌ఎస్‌ గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వలేకే ముస్లింలతో ముడిపెడుతున్నారు. దేశంలో జరిగే ఎన్నికలు కుటంబ రాజకీయాలకు, జాతీయవాద రాజకీయాలకు మధ్య జరిగే పోరాటం. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ నాయకులు భారత్‌ మాతాకు జై అనొద్దు, సోనియా గాంధీకి జై అనాలన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో అర్థమవుతోంది దేశమంటే కాంగ్రెస్‌కు ఎంత అభిమానమో’ అంటూ మురళీధర్‌ రావు కాంగ్రెస్‌, టీడీపీలప ధ్వజమెత్తారు.
Tags:Talks on Chandrababu should be held

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *