తెలంగాణలో తమిళనాడు రాజకీయాలు

Date:21/06/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ సాధన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థి ఉనికిని కకావికలం చేసిన కేసీఆర్.. భవిష్యత్ రాజకీయాల కోసం మరో మహత్తర స్ట్రాటజీని సిద్దం చేస్తునట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్నటిదాకా తామే ప్రత్యామ్నాయం అన్న కాంగ్రెస్ స్థానంలో.. నేడు బీజేపీ కూడా పోటీకి రావడంతో.. అసలు మరే పార్టీకి ఛాన్స్ ఇవ్వకుండా సరికొత్త వ్యూహంతో ముందుకు కదలాలని యోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటా వ్యూహం అంటే.. ‘తమిళనాడు తరహా రాజకీయం’ రాష్ట్రంలో అమలుచేయడం. తెలంగాణలో తమిళనాడు తరహా రాజకీయాన్ని గనుక పక్కాగా అమలుచేస్తే.. అధికారం ఎన్నటికీ తమ చేయి దాటిపోదని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.తమిళనాడులో ఎలాగైతే అధికారం డీఎంకె-అన్నాడీఎంకెల చేయి దాటి మరో పార్టీ చేతిలోకి వెళ్లదో.. తెలంగాణలోనూ అదే జరగాలని కేసీఆర్ కోరుకుంటున్నట్టుగా చర్చ జరుగుతోంది. డీఎంకెలో వారసత్వ పోరు మొదలై విభేదాల కారణంగా ఎంజీఆర్ పార్టీ నుంచి బయటకొచ్చి సొంతంగా అన్నాడీఎంకెను స్థాపించారు. అప్పటి నుంచి అధికారం డీఎంకె-అన్నాడీఎంకెల చేతులు మారుతుందే తప్ప.. మరో పార్టీకి అక్కడ స్థానం లేదు.

 

 

 

 

 

 

 

టీఆర్ఎస్‌లోనూ ప్రస్తుతం వారసత్వ పోరు నడుస్తుందన్న వాదన చాలాకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తనయుడు కేటీఆర్ కోసమే హరీశ్ రావును కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హరీశ్ రావు పార్టీని చీల్చుతారని కొందరు.. పార్టీ మారుతారని మరికొందరు.. ఇలా రకరకాల ఊహాగానాలు తెర పైకి వస్తూనే ఉన్నాయి. అయితే హరీశ్ వాటన్నింటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ తన పుట్టుక-చావు టీఆర్ఎస్‌తోనే అని స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయినా సరే ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ తమిళనాడు తరహా రాజకీయం గురించి ప్రస్తావించినట్టుగా ఓ ప్రముఖ పత్రిక ప్రచురించింది. డీఎంకె, అన్నాడీఎంకెల లాగా టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం జరగాలని.

 

 

 

 

 

 

అలాగైతే తమవాళ్లే అధికారంలో ఉంటారు తప్ప మరొకరికి అవకాశం ఉండదని కేసీఆర్ పార్టీ శ్రేణులతో చెప్పినట్టుగా అందులో పేర్కొంది.తెలంగాణపై టీఆర్ఎస్‌కు ఉన్నంత అవగాహన, పట్టు మరో పార్టీకి లేదని.. ప్రత్యామ్నాయంగా మరో పార్టీ పుట్టుకొచ్చినా అది టీఆర్ఎస్ నుంచే ఉండాలని కేసీఆర్ ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. అంటే, ఇప్పుడు తెరపై ఉన్న ఊహాగానాల ప్రకారం ఒకవేళ హరీశ్ రావు పార్టీని చీల్చినా.. అది కేసీఆర్ స్ట్రాటజీలో భాగమే అనుకోవచ్చేమో..! దీంతో హరీశ్-కేటీఆర్ మధ్య అంతర్గత పోరుకు తెరపడి.. అధికారం అయితే హరీశ్ చేతిలో, లేదంటే కేటీఆర్ చేతిలోనో ఉంటుంది. అంతే తప్ప మూడోవాళ్ల చేతిలోకి వెళ్లదు. మొత్తానికి ప్రత్యర్థుల అంచనాలకు అందని రీతిలో కేసీఆర్ వ్యూహాలు పన్నడంలో ధిట్ట అని దీన్నిబట్టి మరోసారి అర్థమవుతోంది.

 

 తెలంగాణలో కాసుల కురిపిస్తున్న ఇసుక

Tags: Tamil Nadu politics in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *