తమిళనాట శ్రీరెడ్డి లీక్స్ ప్రకంపనలు

Tamil Nadu Shri Reddy Leaks vibe

Tamil Nadu Shri Reddy Leaks vibe

Date:20/07/2018
చెన్నై ముచ్చట్లు:
నిన్నటి వరకు టాలీవుడ్‌లోని పలువురికి నిద్రలేకుండా చేసిన నటి శ్రీరెడ్డి.. ఇప్పుడు చెన్నై చెక్కేసింది. తమిళ ఇండస్ట్రీలోని నటులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తోంది. ప్రముఖ దర్శకులు మురుగదాస్, సుందర్ సి, కొరియోగ్రాఫర్ లారెన్స్, హీరోలు సందీప్ కిషన్, శ్రీరామ్‌లు.. అవకాశాలు ఇస్తామని చెప్పి.. తనను వాడుకున్నారని ఆరోపించింది. దీనిపై హీరో కార్తి సీరియస్‌గానే స్పందించారు. ‘‘శ్రీరెడ్డి ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిపైనా ఆరోపణలు చేస్తోంది. ఫిర్యాదు అందకుండా నడిగర్ సంఘం (సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సభ్యులు ఎవరైనా శ్రీరెడ్డి మీద ఫిర్యాదు చేసినట్లయితే.. ఈ విషయంలో నడిగర్ సంఘం కలుగజేసుకుంటుంది. శ్రీరెడ్డి దగ్గర తగిన ఆధారాలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలి’’ అని తెలిపారు. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కులు ఏఆర్ మురుగ‌దాస్‌, సుంద‌ర్ సి, శ్రీకాంత్, రాఘ‌వ లారెన్స్ త‌న‌ను వేదించార‌ని చెప్పిన ఆమె న‌టుడు విశాల్ తో త‌న‌కు ముప్పు ఉంద‌ని ఆరోపించారు. ఈ విష‌యంపై స్పందించిన హీరో కార్తి… శ్రీరెడ్డి వ‌ద్ద వేదింపుల‌కు సంబందించిన ఆధారాలు ఉంటే పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని, కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఆమె ఏ ఆధారాలూ బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని అన్నారు. ఇటువంటి నిరాధార అంశానికి మీడియా ప్రాధాన్య‌త ఇవ్వాలో లేదో ఆలోచించుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. అయితే, క్యాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్లు న‌య‌న‌తార‌, త్రిష‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, స‌మంత కూడా బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడాల‌ని శ్రీరెడ్డి తాజాగా కోరారు.కార్తి నడిగర్ సంఘానికి ట్రెజరర్‌ పదవిలో ఉన్నారు. త్వరలోనే దీనిపై నడిగర్ సంఘం స్పందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. శ్రీరెడ్డి కేవలం హీరోల మీదే కాదు.. పరోక్షంగా హీరోయిన్లను కూడా ఈ వివాదాల్లోకి లాగుతోంది. తాజా ఆమె టాలీవుడ్‌లోని ప్రముఖ హీరోయిన్ల పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘నా లిస్ట్ చాలా పెద్దదని చాలామంది ఆరోపిస్తున్నారు. త్రిషా, నయనతార, కాజల్, సమంత తమ లిస్ట్ బయటపెడితే.. అది తన లిస్ట్ కంటే పెద్దగా ఉంటుంది’’ అని తెలిపింది.
తమిళనాట శ్రీరెడ్డి లీక్స్ ప్రకంపనలు https://www.telugumuchatlu.com/tamil-nadu-shri-reddy-leaks-vibe/
Tags:Tamil Nadu Shri Reddy Leaks vibe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *