తమిళ స్మగ్లర్ అరెస్టు

-5 దుంగలు సహా స్మగ్లర్ అరెస్ట్

 

తిరుపతి ముచ్చట్లు:

నాగపట్ల బీట్ పరిథి లోని దేవుడుగుడి అటవీ ప్రాంతంలో ఐదు దుంగలు తో సహా ఒక తమిళ స్మగ్లర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డిఎస్పీ మురళీధర్ నేతృత్వంలో ఆర్ ఐ భాస్కర్ కు చెందిన ఆర్ ఎస్ ఐ లు సురేష్, లింగాధర్, విశ్వనాథ్ ల బృందం గురువారం నుంచి నాగపట్ల బీట్ పరిథి లో కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కొంతమంది దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు చుట్టు ముట్టారు.  అయితే చీకట్లో నలుగురు పారి పోగా ఒకడు పట్టుబడ్డాడు. అతనిని తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా పులియకుప్పం కు చెందిన దొర స్వామి (50) గా గుర్తించారు. ఇతనిని విచారించగా వారం రోజులు క్రితం15 మంది వచ్చినట్లు తెలిపారు. ఈ కేసును విచారిస్తున్న సి ఐ చంద్ర శేఖర్ మాట్లాడుతూ మిగిలిన వారి కోసం రెండు టీమ్ లు గాలిస్తున్నాయని తెలిపారు. ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ మోహన్ నాయక్, డీ ఆర్ ఓ జానీ బాషా పాల్గొన్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Tamil smuggler arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *