tamo

tamo

– ధరలు పతనం
– పదిహేనుకిలోలు రూ.80లు
– కిలో రూ. 6లు

Date:07/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు నిరాశకు లోనైయ్యారు. పుంగనూరులో గత నెల రోజులుగా ఈనామ్‌ పద్దతితో టమోటాలు విక్రయించాలన్న నిర్ణయంపై ధర్నాలు చేస్తూ నిరాశకు గురైన రైతులకు టమోటా ధరలు పతనం కావడం గుదిబండగా మారింది. పుంగనూరు మార్కెట్‌ కమిటిలో ప్రతి రోజు సుమారు 30 లారీలు సరుకు పొరుగు ర్ఖా•లకు రవాణా చేస్తారు. ఇలా ఉండగా గత నాలుగు రోజులుగా 15 కేజిల టమోటాబాక్సు వెహోదటిరకం ధర 80లు, రెండవరకం బాక్సు ధర 60లుగా కొనుగోలు చేస్తున్నారు. పంటలు అధికంగా రావడంతో ధరలు తగ్గిపోయింది. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను సుమారు 730 హెక్టార్లలో టమోటా పంటను పండించారు. వర్షాలు సకాలంలో కురిసినా టమోటాకు ధరలు లేకపోవడం రైతుకు తీవ్ర ఆవేదనను మిగిల్చింది. పంటలను తెగుళ్ల నుంచి కాపాడేందుకు ఎరువులకు, విత్తనాలకు కలసి ఎకరాకురూ.25 వేలనుంచి రూ.50 వేల వరకు రైతులు ఖర్చు చేశారు. కాగా అనంతపురం, కర్నాటక టమోటా దిగుమతి కావడం,తమిళనాడులో పంటలు పండటంతో తమిళనాడు వ్యాపారులు పుంగనూరు మార్కెట్‌కు తక్కువ సంఖ్యలో రావడం జరిగింది. అలాగే ఇటీవల కురిసిన సిరిజల్లులకు టమోటా పంట బాగా వ చ్చింది. రైతులు పొలాల వద్ద టమోటాను రాసులు పోసుకోవడం జరిగింది. వ్యాపారులు రాకపోవడంతో టమోటా మార్కెట్‌లో నిల్వ చేరి , వినియోగం తగ్గి ధరలు పడిపోయింది.

ఇస్రో కృషి సాహసోపేతం

Tags; tamo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *