సబ్ కలెక్టర్ కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

గూడూరు ముచ్చట్లు:


ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన సేవలు చిరస్మరణీయమని గూడూరు ఆర్డీవో మురళీకృష్ణ అన్నారు . టంగుటూరి ప్రకాశం పంతులు 151 వ జయంతి వేడుకలు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు .గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు 151 వ జయంతి సందర్భంగా ప్రకాశం పంతులు చిత్రపటానికి గూడూరు ఆర్డిఓ మురళీకృష్ణ మరియు సిబ్బంది పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు .  ఈ సందర్భంగా ఆర్డిఓ మురళీకృష్ణ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ప్రకాశం పంతులు అనేక ఉద్యమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చారని పేర్కొన్నారు .  అంటరానితనం  నిర్మూలన కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారని , బాల్య వివాహాలను వ్యతిరేకించారని , వితంతు వివాహాలను ప్రోత్సహించారు అని , మూఢాచారాలను పాటించ వద్దని ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ అనేక పోరాటాలు ఉద్యమాలు నడిపిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు .

 

Tags: Tanguturi Prakasam Pantulu Jayanti in Sub Collector Office

Leave A Reply

Your email address will not be published.