Natyam ad

పుంగనూరులో స్కార్పియోను ఢీకొన్న ట్యాంకర్‌ – ఇద్దరు మృతి

– ఇద్దరికి తీవ్ర గాయాలు
-పట్టణంలో విషాదం

పుంగనూరు ముచ్చట్లు:

అతివేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న స్కార్పియోను సిమెంటు కాంక్రిట్‌ ట్యాంకర్‌ ఢీకొని ఈడ్చుకెళ్ళడంతో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం మండలంలోని కమతంపల్లె వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన న్యాయవాది విశ్వనాథరెడ్డి (52), వ్యాపారి అక్కుల్‌రెడ్డి(68), వెంకట్రమణస్వామి ఆలయ మాజి చైర్మన్‌ మునస్వామిరెడ్డి (67), రైతు బాలగురప్పల్లెకు చెందిన భూపాల్‌రాజు(50) కలసి స్కార్పియోలో పుంగనూరు నుంచి పలమనేరుకు వెళ్తుండగా ఎదురుగా మదనపల్లెకు వెళ్తున్న ట్యాంకర్‌ లారీ అతివేగంగా వచ్చి స్కార్పియోను ఢీకొని దూసుకుంటు రోడ్డు క్రిందకు తోసివేయడంతో స్కార్పియో బోల్తా పడి నుజ్జునుజైంది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న వారు చిక్కుకుపోవడంతో ప్రమాదాన్ని గమనించిన గ్రామస్తులు గుణపాలతో పెరికి బాధితులు భూపాల్‌రాజు,విశ్వనాథరెడ్డి, అక్కుల్‌రెడ్డి, మునస్వామిరెడ్డిలను బయటకు తీశారు. భూపాల్‌రాజు అక్కడిక్కడే మృతి చెందాడు. బాదితులను 108 లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మునస్వామిరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్కుల్‌రెడ్డికి , విశ్వనాథరెడ్డికి తీవ్ర గాయాలుకావడంతో బాదితులను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.కాగా ప్రయాణిస్తున్న నలుగురు ప్రముఖులు కావడంతో స్నేహితులు, బంధుమిత్రులు రావడంతో ఆసుపత్రిలో విషాదం చాయలు అలుముకున్నాయి. ఈ మేరకు ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి, శవాలను పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Tanker collided with Scorpio in Punganur – two killed

 

Leave A Reply

Your email address will not be published.