నోరు తెచ్చిన తంటా

Date:27/10/2020

భోపాల్ ముచ్చట్లు:

ఈ ఎన్నికలు ఆయన రాజకీయ జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఈ ఎన్నికలు ఆయనను మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పిస్తాయి. మరో మూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పే వీలుంటుంది. కానీ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాధ్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. కమల్ నాధ్ నోటి దురుసు కారణంగా ఆయన వివాదానికి కేంద్ర బిందువు అవ్వడమే కాకుండా పార్టీని కూడా ఇరకాటంలో పడేశారు.మధ్యప్రదేశ్ లో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటే తిరిగి కమల్ నాధ్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. జ్యోతిరాదిత్య సింధియా 22 మంది ఎమ్మెల్యేలతో పార్టీని విడిచి వెళ్లిపోవడంతో కమల్ నాధ్ అర్ధాంతరంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 22 మంది పై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తన పదవి నిలుపుకోవాలని ఒకవైపు శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు.ఈ పరిస్థితుల్లో నోరు అదుపులో పెట్టుకోవాల్సిన కమల్ నాధ్ నోరు జారారు.

 

 

బీజేపీ పార్టీ అభ్యర్థి ఇమ్మార్తి దేవిని ఐటం అంటూ వ్యాఖ్యానించి కమల్ నాధ్ చిక్కుల్లో పడ్డారు. ఇమ్మార్తిదేవి దళిత మహిళ కావడంతో కమల్ నాధ్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కమల్ నాధ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాజకీయంగా ఫుల్లుగా వాడుకునేందుకు అన్ని రకాలుగా సిద్ధమయింది.కమల్ నాధ్ వ్యాఖ్యలకు నిరసనగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియాలు మౌనదీక్ష కూడా చేశారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లాంటి నేతలు కమల్ నాధ్ వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. ఆయన మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఉప ఎన్నికల వేళ కమల్ నాధ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆయనను ఇబ్బంది పెడుతున్నాయనే చెప్పాలి. దీనిపై ఎన్నికల కమిషన్ కు కూడా బీజేపీ ఫిర్యాదు చేసింది.

14 రాష్ర్టాల్లో ట్రంప్‌, బిడెన్‌ మధ్య పోటీ ‘నువ్వా-నేనా

Tags: Tanta brought to the mouth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *