కమలానికి తారక మంత్రం… రామమందిరం
లక్నో ముచ్చట్లు:
భారతీయ జనతాపార్టీ రాజకీయాలు అంత త్వరగా అర్ధం కావు. ఒకదాన్ని మరో దానికి సంబంధం లేకున్నా ఏదో విధంగా ముడి పెట్టి రచ్చచేయడం, చర్చలకు వీలు కల్పించడంలో ఆనందిస్తుంటారు కమలనాధులు. తాజాగా మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలను రాముడిని అవమా నిస్తున్నా రంటూ ఊహించని రాజకీయాలకు కేంద్రహోం మంత్రి అమిత్ షా తెరలేపారు. పైగా కాంగ్రెస్ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తోందని విమర్శించారు. షా మాట అందుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాద్ రామభక్తులను అవమానించినందుకు దేశానికి కాంగ్రెస్ క్షమాపణలు కోరాలని అన్నారు. ప్రతిపక్షం నల్లదుస్తుల్లో నిరసన వ్యక్తం చేయడం అదీ అయోధ్యదివస్ ను దేశ ప్రజలు జరుపుతున్న రోజున ఆ విధంగా కాంగ్రెస్ వ్యవహరించడం రామభక్తులను అవమానించినట్లేనని ఆదిత్యనాధ్ అన్నా రు.
అయితే తమ నిరసనకు బిజేపీ ఇలా మతం రంగుపూయడం దారుణమని కాంగ్రెస్ నాయకులు మండి పడుతున్నారు. ప్రధాని మోదీ 2020 ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దానికి కాంగ్రెస్ ప్రస్తుత నిరసనలకు ముడి పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. రామమందిరం, అయోధ్య అంశాల చుట్టూ తిరిగిన రాజకీయాల ఆధారంగానే బీజేపీ ఊహించని విధంగా కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. 1984లో కేవలం రెండు సీట్టు ఉన్న పరిస్థితుల నుంచీ దేశ రాజకీ యాల్లో కీలకపాత్ర వహించే స్థాయికి వేగంగా అభివృద్ధి చెందింది. అంతేగాక వరుసగా రెండో పర్యాయం అధికారంలో కొనసాగుతోంది. రామమందిరం అంశమైతే 1980ల్లో దేశ రాజకీయాలను ఊహించని మలుపు తిప్పింది. దీని ప్రభావంతోనే కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఈ సమయంలోనే జనతా పార్టీ లో భాగమైన భారతీయ జనసంఘ్ తో కలిసి బీజేపీ అవతరించింది. క్రమేపీ హిందూత్వ అజెండాతో జాతీ య రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగింది.

కాంగ్రెసేత పార్టీ వాజ్‌పేయి ప్రధానిగా ఐదేళ్లు కేంద్రంలో సత్తా చాటింది. కానీ రామ మం దిరం అంశం కాంగ్రెస్‌కు విజయాన్ని ఆపాదించింది. అలాగే విపక్షాలు ఆ అంశంలో కాస్తంత వెనక డుగూ వేయవలసి వచ్చింది. 19190లో రామమందిరం జోరందుకున్నపుడు, అయోధ్యలో కరసేవకులపై కాల్పులకు ఆదేశించినపుడు సమాజ్‌వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్‌కు బీజేపీ మౌలానా ములాయం అని కొత్త పేరుతో దాడిచేసింది. 2019లో సుప్రీం కోర్టు రామమందిర నిర్మాణానికి వీలు కల్పిస్తూ తీర్పు నిచ్చింది. యుపి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ రామ మందిరానికి ఓటు వేయండి అన్న నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లింది. వందలమంది సాధువులు ప్రచారానికి రంగంలోకి దిగారు. వారిలో మహంత్ రామదాస్, నాగా సాధు అర్జున్ దాస్, బాబా బ్రజేష్ దాస్ కూడా ఉన్నారు. వారందరి లక్ష్యం ప్రజల్ని ముఖ్యంగా ఓటర్లను బీజేపీవైపు మొగ్గుచూపేలా ఆకట్టుకోవడం. యుసి సీఎం ఆదిత్యనాధ్ దర్శకత్వంలో అదే జరి గింది. జనాన్ని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు వచ్చేట్టు వీలు కల్పించడం ఓట్లకు గాలం వేయడం లో భాగంగానే బీజేపీ చేపట్టింది. ఇటీవలి కాలంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ కన్వీనర్ అరవింద్ ఖేజ్రివాల్ ఉత్తరప్రదేశ్, గోవాలలో తీర్ధయాత్రలు ఉచితంగా చేసేందుకు వీలుకల్పి స్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్ర లో శివసేన నాయకుడు ఆదిత్య థాక్రే, ఎంఎన్ ఎస్ నాయకుడు రాజ్ థాక్రే కూడా అయోధ్యలో రామమందిరం దర్శించడానికి సుముఖత వ్యక్తం చేశారు.
Tags: Taraka mantra for lotus… Ram temple
