టార్గెట్ చేరుకోవడం కష్టమే!

Target is difficult to reach!

Target is difficult to reach!

Date:10/10/2018
గుంటూరు  ముచ్చట్లు:
పంటల దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. భవిష్యత్‌లో దేశంలోనే అగ్రగామిగా నిలవాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. ఇక ప్రభుత్వం కూడా పెద్ద మొత్తంలోనే పంటలు సేకరిస్తోంది. ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ పంటల దిగుబడులు పెరిగేలా చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమం అంతా బాగానే ఉన్నా ఈ సీజన్‌లో మాత్రం లక్ష్యానికి అనుగుణంగా పంటలు సమకూరవని వ్యవసాయ వర్గాలు అంటున్నాయి. ఖరీఫ్‌ టార్గెట్ చేరుకునేంతగా దిగుబడులు లేవని పలువురు రైతులు చెప్తున్నారు.
ప్రధానంగా ఆహారపంటలు లక్ష్యానికి అనుగుణంగా లేవని అంటున్నారు. ఖరీఫ్‌లో 98లక్షల టన్నుల ఆహార పంటల దిగుబడి సాధించాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. అయితే వివిధ కారణాలతో లక్ష్యానికి తగ్గట్లుగా దిగుబడులు రాలేదు. దాదాపు 15టన్నుల వరకూ కోతపడే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. 98కి గానూ 83లక్షల టన్నుల దిగుబడే లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆహార పంటల దిగుబడి తగ్గడంపై కొంత ఆందోళన వెల్లువెత్తుతోంది. పంటల దిగుబడులు పెరిగేలా ప్రభుత్వమే రైతులకు అండగా ఉండాలని అంతా కోరుతున్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంటల దిగుబడిని ప్రభావితం చేస్తున్నాయి. కురిస్తే భారీ వర్షాలు.. లేదంటే వర్షాభావ పరిస్థితులు. ఇక తెగుళ్ల సంగతి సరేసరి. మొత్తంగా పంటల దిగుబడి వివిధ కారణాలతో ప్రభావితమవుతోంది. సాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. నీరు వృథాకాని పద్ధతులను రైతులకు పరిచయం చేసింది. నీటిని పొదుపు చేస్తూనే వ్యవసాయక్షేత్రాలకు పూర్తిస్థాయిలో నీరు అందించుకునేలా చర్యలు తీసుకుంటోంది.
అయితే ఏళ్లుగా వేధిస్తున్న కరవు పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. ఫలితంగా దిగుబడులూ తగ్గాయి. ఆహారపంటల ఉత్పత్తిలో క్షీణత ఎవ్వరికీ మంచిదికాదు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలి. ఆహారోత్పత్తి తగ్గితే దిగుమతులపై ఆధారపడాల్సిన దుస్థితి తలెత్తుతుంది. జనాభా పెరిగిపోతున్న ప్రస్తుత రోజుల్లో ఆహార పంటల దిగుబడులు పెద్దమొత్తంలో ఉండాల్సిందే. లేని పక్షంలో ఆహారానికి కటకట ఏర్పడుతుంది.
Tags:Target is difficult to reach!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *