టార్గెట్ కుప్పం

విజయవాడ ముచ్చట్లు:


ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతి రోజు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలతో వార్తల్లో్ నిలుస్తున్నారు. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ కుప్పం నియోజకవర్గంపై కన్నేసింది. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 22న కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే హెలిప్యాడ్‌, బహిరంగ సభ స్థలాలను సైతం పరిశీలించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ కుప్పం నియోజకవర్గాన్ని విజయవంతం చేయాలని మంత్రులు కోరుతున్నారు.బీసీల ఓట్లతో కుప్పంలో గెలిచిన చంద్రబాబు రైతులకు చేసిందేమి లేదని మంత్రులు ఆరోపిస్తున్నారు. ఎలాగైనా ఈ సారి కుప్పం నియోజకవర్గంలో జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది వైసీపీ. కుప్పం నుండి సీఎం చేతుల మీదుగా చేయూత కార్యక్రమం ప్రారంభం కానుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇటీవల తెలిపారు. చంద్రబాబు నాయుడు గత కొన్ని దఫాలుగా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ గెలుపొందుతూ వస్తున్నారు. అయితే ఈ సారి చంద్రబాబు కుప్పం నుంచి బరిలోకి దిగితే బాబు విజయాల పరంపరకు అడ్డుకట్ట వేయాలని వైసీపీ పట్టుదలతో ఉంది.

 

Tags: Target stack

Leave A Reply

Your email address will not be published.