జూన్ 1 న రాజ్ తరుణ్ – ఏ.కె.ఎంటర్ టైన్మెంట్స్ “రాజు గాడు” విడుదల 

Tarun Raj on June 1 - ekeentar tainments "king of the forest" is released

Tarun Raj on June 1 - ekeentar tainments "king of the forest" is released

Date:24/05/2018
సినిమా ముచట్లు:
యంగ్ హీరో రాజ్ తరుణ్ “రాజుగాడు” చిత్రం జూన్ 1 న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన పాటలకు మరియు చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది. రాజ్ తరుణ్ తో ‘ఈడో రకం ఆడో రకం’, ‘అందగాడు ‘, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి విజయవంతమైన చిత్రాలనందించిన ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం కావడంతో “రాజు గాడు” పై భారీ ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రంతో సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో డా. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హిలేరియస్ కామెడీ తో ఫామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం అందించారు. ఆడియో లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ లను త్వరలో జరపనున్నారు.
తారాగణం:
రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, రావురమేష్, సిజ్జు, పృధ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్యా, ఖయ్యుమ్, అదుర్స్ రఘు, అభి ఫిష్ వెంకట్, గుండు సుదర్శన్, పూజిత, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు నటిస్తున్న
కథ: ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్, మూల కథ: మారుతి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, స్టిల్స్: రాజు, మేకప్: రామ్గా, కాస్ట్యూమ్స్: శివ-ఖాదర్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్-రియల్ సంతోష్, కొరియోగ్రఫీ: రఘు-విజయ్, ఆర్ట్: కృష్ణ మాయ, చీఫ్ కో డైరెక్టర్: ప్రసాద్ దాసం, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రాఫర్: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర-డా.లక్ష్మారెడ్డి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంజనా రెడ్డి.
Tags:Tarun Raj on June 1 – ekeentar tainments “king of the forest” is released

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *