Task Force police caught illegal sand tractors

అక్రమ ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నటాస్క్ ఫోర్స్  పోలీసులు

Date:27/02/2020

బెల్లంపల్లి  ముచ్చట్లు:

కాసిపేట మండలంలోని  గోండుగూడెం  నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్  సిఐ కిరణ్ ఆధ్వర్యంలో

దాడులు నిర్వహించి మూడు ఇసుక ట్రాక్టర్లను ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ మాట్లాడుతూ భూగర్భ జలాలను తగ్గించే విధంగా అక్రమంగా

ఇసుకను రవాణా చేసే వ్యక్తులపై ఎంతటివారైనా కేసులు తప్పవని ఆయన అన్నారు అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే  ఎంతటివారైనా వదిలేది లేదని హెచ్చరించారు పట్టుబడిన

వ్యక్తులను ట్రాక్టర్లను కాజీపేట పోలీస్ వారికి అప్పగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది .ఓంకార్. రాకేష్ .వెంకటేశ్వర్లు .శ్రీనివాస్ పాల్గొన్నారు.

  4 నుంచి 12వ తేదీ వరకు ఉపమాక శ్రీ వేంకటేశ్వరాలయంలో ఏకాదశి కల్యాణాలు

Tags: Task Force police caught illegal sand tractors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *