Corona in the minister's family

కరోనా మహమ్మరితో తస్మాత్ జాగ్రత్త

Date:09/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

సుమారు రెండు నెలలుగా లాక్ డౌన్ నిబంధనలు అమలులో వున్నా కరోనా మహమ్మారి గత రెండు నెలలుగా మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. దురదష్టవశాత్తూ కర్నాటక తమిళనాడు బార్డర్ జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో ఇప్పటవరకూ కరోనా ప్రభావం ఓ మాదిరిగా వున్నప్పటికీ చెన్నై కోయంబేడు మార్కెట్ కారణంగా మన జిల్లా లోనూ కరోనా ప్రభావం ఒక్కసారిగా అధికం కావడం గమనార్హం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో జిల్లా లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వాలు ఎంత సమర్థవంతంగా పని చేస్తున్నప్పటికి ప్రజలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా ప్రభావం మరింత పెరిగే ప్రమాదం పొంచివుంది. కాబట్టి అత్యవసరమయుతే తప్ప వీధుల్లో తిరగడం మానుకోవాలి. పళ్ళు కూరగాయలు ఆకుకూరలు ఇంటికి తెచ్చిన వెంటనే ఉప్పునీటిలో కడిగి శుభ్రం చేయాలి. ఇతర అన్ని రక్షణ జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని మనవి. కోయంబెడు రూపంలో మన జిల్లాకు కరోనా ముప్పు ఎక్కువగా వున్నందున ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. తస్మాత్ జాగ్రత్త

ఎల్జీ ఘటనపై సీఎస్ సమీక్ష

Tags: Tasmat care with Corona Mahammari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *