టీడీపీకి సిద్దాంతాలులేవు : తలసాని

TDB do not have theories:

TDB do not have theories:

 Date:15/09/2018
హైదరాబాద్ ముచ్చట్లు
నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రం లో చాలా డ్రామాలు నడుస్తున్నాయి. బాబ్లీ మీద మాట్లాడుతున్న టీడీపీ నేతలకు ఇంగిత జ్ఞానం ,బుద్ది ఉందా ? తెలంగాణ ,కేంద్ర ప్రభుత్వాలు కలిసి కుట్రపన్ని చంద్రబాబు మీద అరెస్టు వారంటు కు కుట్ర పన్నాయంటారా అని అయన మండిపడ్డారు. చట్టం తన పని తాను చేసుకు పోతుంది. చిన్న విషయానికి చంద్రబాబు చిలవలు ,పలవలు చేస్తున్నారు.
మేము కుట్ర పన్నితే మా ముగ్గురు ఎమ్మెల్యేలకు వారెంట్లు ఎందుకు వస్తాయని అయన అన్నారు. న్యాయ ప్రక్రియ లో భాగమైన చిన్న వారెంటు సాకును చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారు. నా మీద కూడా కేసులు ఉన్నాయి.  ఈ డ్రామా ను ఆపితే బాబు కే మంచిదని అయన అన్నారు. కాంగ్రెస్ హాయం లో నమోదయిన కేసు కు బాబు మమ్మల్ని బాధ్యులను చేస్తారా ? చంద్రబాబు లాగా మా ఎమ్మెల్యేలను మేము ఫణంగా పెట్టం. ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుకు సిద్దమయ్యారు. ఈ పొత్తు ఇప్పుడయ్యింది కాదు ..ఆరునెలల క్రితమే కుదిరింది.
ఈ పొత్తు పర్యవసానాలను చంద్రబాబు రాబోయే రోజుల్లో అనుభవిస్తారు. తెలంగాణ ,ఏపీ లో బాబు మూల్యం చెల్లించుకుంటారని అయన అన్నార. తాత్కాలిక ప్రయోజనాలకోసం దిగజారుతున్న చంద్రబాబు ను ఎన్టీఆర్ అభిమానులు క్షమించరు. టీడీపీ కాంగ్రెస్ పొత్తుతో మాకేమి నష్టం లేదు. ఎన్టీఆర్ ఆత్మ ను క్షోభ పెడుతున్న బాబు ను క్షమించరు. టీడీపీ కి ఓ సిద్ధాంతం లేదు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ పై జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. రాజీవ్ శర్మ బ్రోకర్ అయితే జైపాల్ రెడ్డి మంత్రిగా ఉన్నపుడు రిలయన్స్ కు బ్రోకర్ గా పని చేశారా అని ప్రశ్నించారు.
జైపాల్ కు వయసు పెరిగినా బుద్ది పెరగలేదు. కెసిఆర్ ను గద్దె దించేందుకే పొత్తులని జైపాల్ మాట్లాడతారా ? కెసిఆర్ ను గద్దె దించడమే పనా ?ప్రజలకు చేసేది కాంగ్రెస్ చెప్పదా ? అమిత్ షా ఏవేవో మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి నిబంధనల ప్రకారమే కొన్ని నిధులిచ్చారు. ఆయన ఇంటి నుంచి ఇచ్చారా ? ముస్లిం లకు పన్నెండు శాతం రిజెర్వేషన్ల పై మాట్లాడే హక్కు అమిత్ షా కు లేదని అయన అన్నారు. కేంద్రం లో అధికారం లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా ..అమిత్ షా చేయొచ్చు కదా.
తెలంగాణ నుంచి కేంద్రానికి ఆదాయం భారీ గా సమకూరుతోంది నిజం కాదా ? జమిలి ఎన్నికల నుంచి పారిపోయిన మీరు మమ్మల్ని అంటారా అమిత్ షా అని అన్నారు. మజ్లీస్ తో తెరాస పొత్తు అని మాట్లాడటం తప్ప అమిత్ షా కు మరో పని లేదు. చంద్రబాబు అంటే బీజేపీ ని అనాలి ..మా జోలికి ఎందుకు వస్తారు ? 29 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు బాబ్లీ కేసులో ఎందుకు తెచ్చుకోవడం లేదని అన్నారు.
ఏపీ టీడీపీ నేతలు బాబ్లీ కేసు మీద మాట్లాడటం మాని కాంగ్రెస్ తో పొత్తు మీద బాబు ను నిలదీయాలి. ఒక వేళ పొరపాటున ఇద్దరో ముగ్గురో టీడీపీ తరపున ఎమ్మెల్యేలు గెలిచినా వారు ఆ పార్టీ లో ఉంటారా అని అనుమానం వ్యక్తం చేసారు. తెలంగాణ లో సెటిలర్లు అంటూ ఎవరూ లేరు. నాలుగన్నేరుళ్లుగా తమకు భద్రత లేదని ఎవరయినా ఒక చిన్న కంప్లైంట్ అయినా చేశారా అని అడిగారు.
శాంతి యుతంగా సహజీవనం చేస్తున్న వారి మధ్య టీడీపీ ,కాంగ్రెస్ చిచ్చు పెట్టాలని చూస్తున్నాయి. బీజేపీ ఉన్న ఐదు సీట్లు గెలిస్తే అదే మహా గొప్ప . అమిత్ షా వన్ నేషన్ -వన ఎలక్షన్ నుంచి పారి పోయి తెరాస ను విమర్శిస్తారా ?  తెలంగాణ లో ఏపీ ఇంటలిజెన్స్ అధికారులను మోహరించడం చాలా తప్పు.  చంద్రబాబు డ్రామాలు మాకన్ని తెలుసు. 2009 లో టీడీపీ తెలంగాణ కు ఒప్పుకుంటేనే ఆ పార్టీ తో తెరాస పొత్తు పెట్టుకుంది . గాల్లో దీపం పెట్టి అది అలాగే వెలగాలని కోరుకున్నట్టు ఉంది టీడీపీ కాంగ్రెస్ ల తీరు. టీడీపీ ,కాంగ్రెస్ లు కేడర్ లేని పార్టీ లన అయన విమర్శించారు.
Tags:TDB do not have theories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *