టీడీఎల్పీ నిరసన

అమరావతి ముచ్చట్లు:


బాదుడే బాదుడు పై నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం సభ్యులు  తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద  నిరసనకు దిగారు. ధరలు దిగిరావాలి అంటే జగన్ దిగిపోవాలంటూ  నినాదాలు చేసారు. ప్రజలపై నిత్యావసరాల బాదుడు తగ్గించేలా చర్యలు డిమాండ్ చేస్తూ నిరసన చేసారు. ధరలు ఆకాశంలో… జగన్ ప్యాలస్ లో అంటూ నినాదాలు చేస్తు చెత్త పై పన్నేసిన చెత్త సిఎం జగన్ అని ప్లకార్డుల ప్రదర్శించారు. పెట్రోల్, డీజిల్ పై బాదుడే బాదుడు అంటూ  విమర్శించారు. షాక్ కొట్టేలా విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. ఇసుకను బంగారం చేసిన తుగ్లక్ అన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఓటిఎస్ తో పేదల్ని దోచేశారు. ఇంటి పన్ను పెంచి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. జే బ్రాండ్స్ తో ప్రజల రక్తం తాగుతున్నారని  ఆరోనించారు. ఆర్టీసి ఛార్జీలు బాదుడే బాదుడు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ధరల పెరుగుదల ను నిరసిస్తూ అసెంబ్లీకి  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కాలినడకన వెళ్లారు.

 

Tags: TDLP protest

Leave A Reply

Your email address will not be published.