ప్రకాశం జిల్లాలో టీడపీ కార్యకర్త మృతి బాధాకరం

-మృతుడి కుటుంబానికి  పార్టీ అండగా ఉంటుంది
– అచ్చెన్నాయుడు

Date:18/01/2021

విజయవాడ  ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెంలో విద్యుత్ తీగలు తగిలి తెలుగుదేశం కార్యకర్త మృతి చెందడం బాధాకరం. కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.  అన్న ఎన్టీఆర్  వర్ధంతి సందర్భంగా  తెలుగుదేశం జెండా ఆవిష్కరిస్తున్న సమయంలో జెండా స్తంభానికి విద్యుత్ తీగలు తగిలాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్యకర్త మృతి చెందాడు.ఇద్దరికి గాయాలయ్యాయి. అన్నగారి వర్ధంతి రోజున కార్యకర్త చనిపోవడం కలిచివేసిందని అయన అన్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం. మృతుడి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వారిని అన్ని విధాలా ఆదుకుంటాం. గాయపడిన కార్యకర్తలకు మెరుగైన  వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని అయన అన్నారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags:TDP activist killed in Prakasam district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *