టీడీపీ, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ

TDP and conflict between Waikato operatives

TDP and conflict between Waikato operatives

Date:15/08/2018
ఒంగోలు ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా    కనిగిరిలో వైసీపీ, తెలుఁగు దేశం పార్టీల కార్యకర్తలమధ్య ఫ్లెక్సీ ల ఏర్పటు లో వివాదం చోటు చేసుకుంది. అ వివాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది.  ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం దూషించుకుంటూ ఘర్షణ పడడం తో రంగప్రవేశం చేసిన పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.
వెలుగొండ ప్రాజెక్ట్ సందర్శనకోసం కనిగిరి నుండి వెలుగొండ ప్రాజెక్ట్ వద్దకు బుదవారం కనిగిరి నియోజక వర్గం నుండి మాజీ పార్లమెంటు సభ్యుడు  వై వీ సుబ్బారెడ్డి పాదయాత్ర నేపధ్యంలో ఈ ఘర్షణ  మొదలయింది. పాదయాత్ర నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు కనిగిరిలోని పామూరుబస్టాండ్ సెంటర్లో  అర్ధరాత్రి శాసనసభ్యుడు కదిరి బాబురావు ప్లెక్సీ లను తొలిగించాని టీడీపీ శ్రేణుల ఆరోపణ.
బాబురావు ప్లెక్సీలు,బోర్డులకు వై వీ సుబ్బారెడ్డి పాదయాత్రకు సంబంధించిన ప్లెక్సీలను ఏర్పటు చేసారని వివాదం. అది కాస్ఆ ముదిరి టీడీపీ ,వైసీపీ కార్యకర్తలమద్య ఘర్షణకు దారి తీసింది. వివాదం పెద్దది కాకుండా పొలీసులు ఇరువర్గాలను చెదర గొట్టారు.వైసీపీ కార్యకర్తలు తొలగించిన ఎమ్మెల్యే బాబురావు ప్లెక్సీల స్థానంలో కొత్తగా తిరిగి ప్లెక్సీలను ఏర్పాటు చెసారు. పొలీసులు పామూరు బస్టాండు సెంటర్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు .
Tags:TDP and conflict between Waikato operatives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *