టీడీపీ, వైకాపా రెండు కుటుంబ పార్టీలే
గూడూరు ముచ్చట్లు:
మూడు లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని అవినీతి లేని పాలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్నారని ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా ప్రధానమంత్రి చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు వెల్లడించారు గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయిస్ భవనంలో జరిగిన కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు.గూడూరు పట్టణంలో నిర్వహించిన నియోజకవర్గ బిజెపి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ,టిడిపి ప్రభుత్వం పై మండిపడ్డారు. 2024లో ఆంధ్ర రాష్ట్రంలో బిజెపి, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యం గా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఏపీలో చంద్రబాబు ,జగన్ ప్రభుత్వాలు రెండు కుటుంబ పాలన పార్టీలే అని ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధి లేని అప్పుల రాష్ట్రమని ,అంతా అవినీతి మయమని అన్నారు. గూడూరు రైల్వే స్టేషన్ లో కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని గుర్తు చేశారు . ఈ రాష్ట్రంలో బస్టాండ్లు అద్వానంగా ఉన్నాయని.2006 నుంచి ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయని…2014 తర్వాత మోడీ అధికారంలోకి వచ్చాక ఏపీలో విద్యుత్ కోతలు తగ్గాయని అన్నారు పట్టబద్రుల కు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కార కృషి చేసే వ్యక్తి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ని పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి శాసనమండలికి పంపించాలని కోరారు .
Tags; TDP and Vaikapa are both family parties

