Natyam ad

కామాక్షితాయి సన్నిధిలో టీడీపీ బోర్డు సభ్యులు కృష్ణమూర్తి,  సతీమణి అనురాధ

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్లను తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యులు కృష్ణమూర్తి ఆయన సతీమణి అనురాధ సతీ సమేతంగా దర్శించుకున్నారు.శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భముగా ,  టీటీడీ బోర్డు మెంబర్  క్రిష్ణమూర్తి ధర్మపత్ని అనురాధ  మరియు నెల్లూరు రూరల్ శాసన సభ్యులు   కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  మరియు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్   ఏ . మలోల , బుచ్చిరెడ్డిపాలెం మండలం తహసిల్దార్ యం. ప్రమీల , ఎస్.ఐ  కె.వీర ప్రతాప్  తదితరులు విచ్చేసి శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షితాయి వార్లను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు  మరియు కార్యనిర్వహణ అధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు మరియు పాలక మండలి సభ్యులు గుమ్మా రఘురామయ్య , ముంగర శివ కుమార్ మరియు ఎక్స్ ఆఫీషియో సభ్యులు శ్రీ ఎస్ శశిశేఖర్ శర్మ   ఆలయ మర్యాదలతో   శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి, శ్రీ మల్లికార్జున స్వామి వారికి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, శ్రీ కామాక్షితాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ లాంచనాలతో వారికి శేషవస్త్రంతో సత్కరించి, ప్రసాదములు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పుట్టా లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: TDP board members Krishnamurthy and wife Anuradha were present in Kamakshithai

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.