టీడీపీ ప్రచారం
ఎమ్మిగనూరు ముచ్చట్లు
శనివారం నాడు ఎమ్మెల్సీ ప్రచారం చివరి రోజు 16వ వార్డు ఇంచార్జ్, మాజీ కౌన్సిలర్ దాదాసాహెబ్ ఆధ్వర్యంలో చివరి రోజు ప్రచారంలో భాగంగా పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని శారద కాన్వెంట్ లైను గిప్సన్ కాలనీ, రామయ్య కొట్టాలు అబ్దుల్లా నగర్ తదితర ఆయా ఏరియాలలో గల పట్టభద్రులను కలిసి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి తరపున పోటీ చేయుచున్న భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్ బ్యాలెట్ నమూనా చూపిస్తూ, ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. అలాగే పట్టభద్రుల, నిరుద్యోగుల, ప్రయివేటు ఉద్యోగుల సమస్యలను శాసన మండలిలో వినిపించే సత్తా ఉన్న తెలుగుదేశం అభ్యర్థి భీమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి వారికి ఓటు వేసి వేయించి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో యూనిటీ ఇంచార్జ్ కామర్థి మహేష్, బూత్ కన్వీనర్, బి రఘు, గంగన్న, దాదా కలందర్, అబ్దుల్లా , మహబూబ్ భాష, ఫయాజ్ మరియు వార్డ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags;TDP campaign
