ఎమ్మెల్యే సీతక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు టీడీపీ అధినేత చంద్రబాబు

అమరావతి   ముచ్చట్లు:

 

ములుగు ఎమ్మెల్యే సీతక్క పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన.. తెలంగాణ మహిళా నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. గిరిజనుల, ఆదివాసీల, పేదల బాధలు తీర్చడానికి అహర్నిశలు శ్రమించే సీతక్క సేవాగుణం స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ప్రజలే సర్వస్వంగా భావించే సీతక్క నిండు నూరేళ్ళూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags; TDP chief Chandrababu wishes MLA Sitakka a happy birthday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *