Natyam ad

దుర్గమ్మను దర్శించుకున్న టిడిపి అధినేత చంద్రబాబు దంపతులు

విజయవాడ ముచ్చట్లు:


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు శనివారం నాడు ఇంద్రకీలాద్రిలోని దుర్గమ్మను దర్శించుకున్నారు.చంద్రబాబు మాట్లాడుతూ మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టాను. ఆదివారం   సింహాచలం దర్శనం చేసుకుని, 5న శ్రీశైల దర్శనం, అనంతరం దర్గా కు కూడా వెళతాను. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు.రాష్ట్రంలో మరల పూర్వ వైభవం వచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వమని కోరాను. నా శేష జీవితం ప్రజలకు అంకితం. ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడను. ఈ కలియుగంలో త్వరగా ప్రతీదీ మర్చిపోతాం.. ఇబ్బంది పెడితే మర్చిపోం. గచ్చిబౌలీలో జరిగిన ఐటీ ఉద్యోగుల సమీకరణకు ఏకగ్రీవంగా అందరూ వచ్చారు. నా బాగు కోరి అందరూ అనునిత్యం ప్రార్ధించారు, కొంతమంది ప్రాణ త్యాగాలు చేసారు. శుక్రవారం నాడు  కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన వెంకటేశ్వర స్వామిని ధర్మాన్ని కాపాడటానికి దర్శనం చేసుకున్నా. ఇవాళ శక్తి స్వరూపిణి దుర్గమ్మ దర్శనం చేసుకుని దుష్టుల్ని శిక్షించమని కోరాను. నా కష్టంలో భారతీయులంతా స్పందించారు. విదేశాల్లో సైతం నాకోసం ప్రార్ధనలు చేసారని అన్నారు.

 

Tags; TDP chief Chandrababu’s couple visited Durgamma

Post Midle
Post Midle