హూజూరాబాద్ లో టీడీపీ పోటీ

కరీంనగర్ ముచ్చట్లు:

 

చంద్రబాబు నాయుడు కసి మీదున్నారు. తన పార్టీని నిర్వీర్యం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గట్టిగా జవాబు చెప్పాలని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడినే ఆకర్షించి ఇక్కడ తమకు పుట్టగతులు లేకుండా చేయాలన్న కేసీఆర్ ఆలోచనను తిప్పికొట్టాలన్న వ్యూహరచనలో చంద్రబాబు ఉన్నారు. ఇందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఎల్.రమణ తనకు నమ్మకస్తుడిగా ఉన్నారు. పార్టీతో సుదీర్ఘ అనుబంధమున్న రమణకు చంద్రబాబు అనేక అవకాశాలు ఇచ్చారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా చివరకు పార్టీ అధ్యక్షుడిగా కూడా చేశారు. ఇక నెల నెలా ఖర్చుల నిమిత్తం దాదాపు ఏడేళ్ల నుంచి పార్టీయే భరిస్తుంది. ఇంత చేసినా నమ్మకమైన రమణ పార్టీని వీడి వెళ్లడంతో చంద్రబాబు కొంత మనస్తాపానికి గురయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. గెలుపోటములు సమస్య కాదని, ీఅక్కడ టీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు సూచించినట్లు తెలిసింది. అవసరమైన ఆర్థిక వనరులను పార్టీ సమకూరుస్తుందని నేతలకు చంద్రబాబు హమీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అభ్యర్థి ఎంపిక కూడా టీఆర్ఎస్ ఎంపిక చేసిన దానిని బట్టి చేయాలని చంద్రబాబు పార్టీ నేతలతో అన్నట్లు సమాచారం.ఇటీవల నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ టీడీపీ పోటీ చేసింది. టీడీపీ పని తెలంగాణలో అయిపోయిందన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలలో పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎల్. రమణ టీఆర్ఎస్ అభ్యర్థి అయినా ఆయనకు పోటీగా టీడీపీ అభ్యర్థి ఉంటారని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద గెలుస్తామన్న నమ్మకం లేకపోయినా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించాలన్న కసితో చంద్రబాబు అభ్యర్థిని బరిలోకి దింపుతున్నారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: TDP competition in Huzurabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *