ఉనికి కోసమే టీడీపీ ధర్నాలు-ఎమ్మెల్యే దోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

అనంతపురం ముచ్చట్లు:

 

రాష్ట్రంలోని  ఇల్లు లేని పేదలకు 30 లక్షల ఇళ్ళ    పట్టాలు  పంపిణీ చేసాం, అదేవిధంగా 15 లక్షల 60 వేల జగనన్న ఇల్లు ఇస్తున్నామని ఎమ్మెల్యే దోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. జగన్న  ఇల్లు  మంజూరు అయిన లబ్దిదారులు వారే స్వయంగా  ఇల్లుకట్టుకోవచ్చు లేదా 1లక్ష 40 వేల రూపాయల మెటీరియల్  మేమే అందిస్తాం.  లబ్ది దారులకు ఇసుక , కంకర , లేబర్ ని కూడా అందిస్తాం. జగన్న ఇళ్ల నిర్మాణ సమయంలో కంకర క్రషర్ యాజమాన్యాలు ధరలు పెంచకుండా మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి అంటేనే రైతు. రైతుని రాజును చేయాలని ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి ది. తెలంగాణ ప్రజలు నీళ్లు చూస్తున్నారు అంటే  అది రాజశేఖర్ రెడ్డి కృపనే. ప్రాజెక్టుల దోపిడీ లకు పాల్పడిన వ్యక్తి చంద్రబాబుది. రెయిన్  గన్ లతో అనంతపురం జిల్లాలో  2 లక్షల హెక్టార్లలో పంటలు పండిచామని జిల్లా లో ఉన్న టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకున్నారు. ఉనికి కోసమే టీడీపీ నాయకులు పొల్లాలో కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. రైతుల కోసం కాదు. జగన్ పేరుకూడా ఉచ్చరించుకోవడానికి టీడీపీ నాయకులు అర్హత లేదు. సీఎం జగన్ పై అవాకులు చివాట్లు చేస్తే 2024 సంవత్సరo లో వచ్చే  ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని అయన అన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags; TDP dharnas for existence-MLA Dopudurthi Prakash Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *