TDP turned into a vortex

సెల్ఫ్ క్వారంటైన్ లో టీడీపీ

Date:06/05/2020

విజయవాడ ముచ్చట్లు:

ఏపీలో తెలుగుదేశం రాజకీయం ఎంతదాకా వచ్చింది. ఓడి ఏడాదవుతున్న వేళ ముందుకు అడుగులు పడుతున్నాయా అంటే సీన్ చూస్తే రివర్స్ లో వెళ్తోందని అంటున్నారు. జగన్ పదేళ్ళ తరువాత వచ్చిన అధికారాన్ని పదిలం చేసుకుందేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. కరోనా వైరస్ వచ్చి ఏపీ ఓ వైపు ఇబ్బందులో ఉన్నా కూడా జగన్ సంక్షేమ జపం మాత్రం వీడలేదు. ఆయ‌న తన టార్గెట్ మరచిపోలేదు. తాను చేయాలనుకున్నది చేస్తూనే ఉన్నారు. దాంతోనే ఇపుడు చంద్రబాబుతో పాటు టీడీపీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని అంటున్నారు. ఏపీలో కలిశానికి కూడా కానకుండా టీడీపీని గత సాధారణ ఎన్నికల్లో చాప చుట్టేశారు ఓటర్లు.ఇక ఇపుడు ఏడాది జగన్ పాలన చూశారు, జగన్ సీఎం గద్దెనెక్కిన తరువాత రోజునుంచే చంద్రబాబు, తెలుగుదేశం తమ్ముళ్ళూ రోడ్డున పడ్డారు. అయినదానికీ, కానిదానికీ జనంలోనే ఉంటూ పోరాటం చేశాయి. వాటి ఫలితాలు స్థానిక ఎన్నికల్లో చూద్దామనుకుంటే జగన్ చేతిలో అధికారం, అమలు చేస్తున్న వ్యూహాలు సైకిల్ కి మళ్ళీ పంక్చర్లు తప్పవని చెప్పేస్తున్నాయి. జగన్ ఒక పద్ధతి ప్రకారం తన కార్యాచరణ అమలుచేస్తున్నారు. ఏపీ రాజకీయ మైదానంలో టీడీపీకి చోటు లేకుండా చేస్తున్నారు.

 

 

 

దాంతో లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీకి చేదు ఫలితాలే ఎదురవుతాయని అంటున్నారు.నిజానికి చంద్రబాబు కరోనా వైరస్ టైంలో హైదరాబాద్ లో ఉండి తప్పు చేశారని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. పోనీ బాబు వరకూ మినహాయింపు ఇవ్వొచ్చు, ఆయన వయసులో పెద్దవారు కాబట్టి సెల్ఫ్ క్వారటైన్ లో ఉంటే ఉండొచ్చు కానీ కొడుకు లోకేష్ నైనా ఏపీకి పంపించి పార్టీని యాక్టివ్ చేయలేకపోయారని అంటున్నారు. లోకేష్ కి ఇది కీలకమైన సమయం. ఆయనేమీ వ్రుధ్ధుడు కాదు కదా, పైగా తండ్రి ప్లేస్ లో ఉండి పార్టీని నడిపించేందుకు ఇదే అవకాశం. తెలంగాణాలో కేటీఆర్ మాదిరిగా లోకేష్ ఏపీలో ఉంటూ పార్టీకి దిశా నిర్దేశం చేస్తే బాగుండేది అంటున్నారు. తద్వారా పార్టీకి జోష్ వచ్చేది అన్న మాట టీడీపీలోనే ఉంది. ఎటూ అధినేత, లొకేష్ ఏపీలోనే లేరు కదాని క్యాడర్ మొత్తం డీలా పడ్డారు, ఇక మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరోనా వేళ ఇల్లు వదిలి బయటకు వచ్చి పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. బాదితులకు సాయం చేసిన ఘటనలూ లేవు. మొత్తానికి మొత్తం వైసీపీకే వదిలేసి చీకట్లో బాణాలు మాత్రమే వేశారు.

 

 

ఇక కరోనా వైరస్ వేధిస్తున్నా ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడా ఆపకుండా జగన్ తన గ్రాఫ్ పెంచుకున్నారు. సంపన్న రాష్ట్రం తెలంగాణాలో కూడా లేని విధంగా మూడు విడతలుగా కోటీ యాభై లక్షల మంది పేదలకు రేషన్ ఇచ్చారు. అలాగే కార్డుదారులందరికీ వేయి రూపాయలు చేతిలో పెట్టారు. మరో వైపు చూస్తే 1400 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు కేటాయించారు. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తున్నారు. ఇంకో వైపు పూర్తిగా ఫీజ్ రీఇంబర్స్మెంట్ ఇస్తూ పేద‌ విద్యార్ధులకు, తల్లిదండ్రులకు బాసటగా నిలిచారు. కళాశాలలకు కూడా పాత బకాయిలు తీర్చారు. ఇపుడు రైతు భరోసా పధకాన్ని కూడా ప్రారభిస్తున్నారు. మొత్తానికి జగన్ తనదైన ముందు చూపుతో స్థానిక ఎన్నికలకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. రేపటి రోజున ఎన్నికలు ఎపుడు జరిగినా మొత్తానికి మొత్తం సీట్లు గెలిచేందుకు పక్కా ప్లాన్ తో సిధ్ధంగా ఉన్నారు. వీటిని చూసిన తరువాతనే టీడీపీ తమ్ముళ్ళు నైరాశ్యంతో ముందే చేతులెత్తేశారా అన్న డౌట్లు వస్తున్నాయి.

తిరుమల అపురూప సుందర చిత్రం

Tags: TDP in Self Quarantine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *