టీడీపీ అంటే మాఫియా పార్టీనా 

TDP is a mafia party

TDP is a mafia party

Date:06/10/2018
ఏలూరు ముచ్చట్లు:
ఏపీలో కొంతమంది పన్ను ఎగవేతదారులపై ఐటీ దాడులు జరిగితే తెలుగు దొంగల పార్టీ ఉలిక్కిపడిందని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జీవిఎల్‌ సరసింహా రావు ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజా ఆవేదన ధర్నాలో ఆయన మాట్లాడుతూ… ఏపీ సీఎం చంద్రబాబు నాయడు ప్రజల సమస్యల గురించి ఏనాడు కేబినెట్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయలేదని..
కానీ ఐటీ దాడుల నేపథ్యంలో ఏం చేయాలని మీటింగ్‌ పెట్టడం సిగ్గుచేటన్నారు. నిన్న జరిగిన అత్యవసర సమావేశం మాఫియా మీటింగ్‌లా ఉందని దుయ్యబట్టారు. టీడీపీ అంటే రాజకీయ పార్టీనా లేక మాఫియా పార్టీనా అంటూ ప్రశ్నించారు. అవినీతిలో ప్రపంచంలోనే టీడీపీ అగ్రస్థానంలో ఉందని ఆరోపించారు.రాష్ట్రంలో అవినీతి పాలన సాగిస్తూ కేంధ్రంపై విమర్శలు చెయ్యడం సరికాదని బీజేపీ నేతలు అన్నారు.
Tags:TDP is a mafia party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *