టీడీపీ నోట ప్రత్యేక హోదా

TDP is a special status

TDP is a special status

Date:03/12/2019

శ్రీకాకుళం ముచ్చట్లు:

ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకుని 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అయిదేళ్ళలో హోదాని పూర్తిగా పక్కన పడేసింది. చివర్లో ఎన్నికల స్టంట్ గా హోదా పేరిట ధర్మ పోరాటాలు చేసినా కూడా టీడీపీని జనం అసలు నమ్మలేదు. సరే వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆరు నెలల పాలన కూడా పూర్తి అయింది. దేశంలో, రాష్ట్రంలో అంతా సర్దుకుంటున్నారు. ప్రత్యేక హోదా అన్నది అడగవద్దని బీజేపీ కూడా చెప్పెసిన వేళ జగన్ సైతం పెద్దగా దాని గురించి తలవడంలేదన్నది నిష్టుర సత్యం. అయితే హోదా విషయం ముగిసిన అధ్యాయమని అంతా భావిస్తున్న వేళ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు ప్రత్యేక హోదా మీద మోజు పెంచుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయం మాట్లాడరా జగన్ అంటూ ఆయన గట్టిగా నిలదీస్తున్నారు. ఏపీలో మొత్తానికి మొత్తం పాతిక ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని జగన్ చెప్పారని, ఇపుడు 22 ఎంపీ సీట్లు ఇచ్చినా కేంద్రం మెడలు ఎక్కడ వంచారని కూడా అయన ప్రశ్నిస్తున్నారు.సరే జగన్ విషయం అలా ఉంచితే ప్రత్యేక హోదా విషయం చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఈ ఆరునెలల్లో కనీసమాత్రంగా కూడా ప్రస్తావనకు తీసుకురాలేదన్నది అందరికీ తెలిసిందే. హోదా ఒక్కటే కాదు, విభజన సమస్యలు, ఏపీ హక్కులు, దక్కాల్సిన ప్యాకేజీలు, అమరావతి రాజధాని, పోలవరానికి ఇవ్వాల్సిన నిధులు ఇలా చాలా విషయాలు ఉన్నాయి.

 

 

 

 

 

 

 

 

కానీ దేని గురించి బాబు ఎపుడూ మాట్లాడింది లేదన్నది త‌మ్ముళ్ళకూ తెలిసిందే. ఎంతసేపూ జగన్ పాలనలో లోపాలను ఎత్తిచూపుతూ చంద్రబాబు పూర్తిగా కరకట్టనే తన శాశ్వత చిరునామాగా చేసేసుకున్నారని విమర్శలు ఉన్నాయి. మరి ప్రత్యేక హోదా అంటే బీజేపీకి ఎక్కడ ఇష్టం ఉండదోనని టీడీపీ సైతం వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోందని అంటున్నారు. తన సొంత పార్టీలో ప్రత్యేక హోదాపై ఏ మాత్రం చర్చ జగగడంలేదన్న సంగతిని పక్కన పెట్టి జగన్ ని కార్నర్ చేయాలని కళా ఇలా బాణాలు ఎక్కుపెట్టడమే విడ్డూరం.టీడీపీ నేతల తీరు చూస్తే తాము మాత్రం ఏపీ హక్కుల కోసం మాట్లాడరు, ముగ్గురు ఎంపీలు ఉన్నా కూడా పార్లమెంట్ లో పొరపాటున కూడా హోదా ఊసెత్తకూడని ఒట్టుపెట్టుకున్నారు. జగన్ మాత్రం హోదా అడగాలి. ఆయన బీజేపీకి చెడ్డ కావాలి. ఆ విధంగా రెండు పార్టీల మధ్య ఎడం ఏర్పడితే తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకాలన్నదే ఎత్తుగడగా కనిపిస్తోంది. సరే హోదా విషయంలో అధికారంలో ఉన్న పార్టీగా జగన్ మీద పెద్ద బాధ్యత ఉంది. అదే సమయంలో సీనియర్ నేతగా చంద్రబాబు సైతం మౌనం వీడి జగన్ తో పాటు అడుగులు ముందుకు వేయాలి.ఇక ప్రజలు హొదా పోరాటానికి సిద్ధంగా లేరని కాడి వదిలేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని తన వంతుగా నిలదీయాలి. రాజకీయాలు వేరు అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాన పార్టీలు కలిస్తే విభజన వల్ల నష్టపోయిన ఏపీకి తప్పకుండా న్యాయం జరుగుతుంది. మరి ఆ దిశగా చేతులు కలిపేందుకు టీడీపీ సిధ్ధంగా ఉంటుందా, లేక జగన్ చేత ప్రత్యేక హోదా పోరాటం చేయించి తాము మాత్రం బీజేపీకి మారు మాట కూడా అనకుండా తన రాజకీయం చూసుకుంటుందా. కళా సెటైర్లు చూస్తూంటే టీడీపీ చిత్తశుద్ధి హోదా పోరులో ఏంటన్నది తెలుస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.

 

దిశకు శాశ్వత పరిష్కారం కావాలి

 

Tags:TDP is a special status

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *