Natyam ad

టీడీపీకి మరోసారి భంగపాటు తప్పదు

నెల్లూరు ముచ్చట్లు:


తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో ప్రారంభించిన పాదయాత్రపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. వైఫల్యం చెందిన వ్యక్తి చేసే పాదయాత్రే యువగళం అని మంత్రి కాకాణి అన్నారు. అలాగే ప్రజా సమస్యలు తెలియని వ్యక్తి, ప్రజలతో సంబంధం లేని వ్యక్తి లోకేష్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ ను చివరి అస్త్రంగా వదిలాడని, టిడిపికి మరో సారి భంగపాటు తప్పదని కాకాణి జోస్యం చెప్పారు. లోకేష్ పాదయాత్ర చూసి భయపడే పరిస్థితి వైసీపికి లేదని, ఆయన పాదయాత్రపై స్పందించాల్సి రావడం దౌర్భాగ్యమని అంటూ లోకేష్ యువగళం పాదయాత్ర కంటే చంద్రబాబు పాపపరిహార యాత్ర అంటే బాగుంటుందని కాకాణి పేర్కొన్నారు.

 

మరో వైపు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ కూడా లోకేష్ పాదయాత్రపై స్పందించారు. చంద్రబాబు, లోకేష్ ది ఐరెన్ లెగ్ అని ఎద్దేవా చేశారు. నందమూరి కుటుంబం నుండి నారా కుటుంబం టిడిపి లాక్కుందని, ఆ కుటుంబాన్ని తోకలా వాడుకుంటుందని విమర్శించారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అస్వస్థతకు గురైన విషయం గుర్తు చేస్తూ ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయేనని అన్నారు. ఎవరెన్ని యాత్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి హవాను ఆపలేరని, జనసేనతో వచ్చినా… ఒంటరిగా వచ్చినా బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు. ఫ్లూటు జింక ముందు ఊదు… జగన్ ముందు కాదు అని సినిమా డైలాగ్ ను చెప్పుకొచ్చారు.

 

Post Midle

Tags; TDP is bound to be disrupted once again

Post Midle