టీడీపీదే అధికారం

TDP is the power

TDP is the power

Date:20/05/2019

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్రంలో తెదేపాకు 110 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం అయన  పార్టీ నేతలతో  టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏడు విడతలు ఆదివారం సాయంత్రంతో ముగియడం, ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇందుకు సంబంధించిన పలు అంశాలపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో  మాట్లాడారు,. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని అయన అన్నారు. 18 నుంచి 2 లోక్ సభ స్థాలు గెలుస్తున్నామన్నారు. అసెంబ్లీ స్థానాల సంఖ్య 120-130 వరకూ వెళ్లొచ్చన్నారు. నూటికి నూరు శాతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మైండ్ గేమ్స్ తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను ఈసీ వివాదం చేసిందన్నారు.మంగళవారం  మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నామని చంద్రబాబు అన్నారు. వీవీప్యాట్లు లెక్కించాలనే డిమాండ్ తో ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ చేసిన దుర్వినియోగం అంతా ఇంతా కాదని విమర్శించారు. ప్రధాని మోదీ అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.

 

కడమకుంట్ల గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసు అధికారులు

 

Tags; TDP is the power

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *