డీలర్ల వ్యవస్థను నాశనం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం టిడిపి

-జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

తుగ్గలి ముచ్చట్లు:

 

డీలర్ల వ్యవస్థను నాశనం చేస్తూ,జాతీయ ఆహార భద్రత చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని తుగ్గలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసనను వ్యక్తం చేశారు. సోమవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర అధ్యక్షులు అచ్చెం నాయుడు మరియు పత్తికొండ నియోజకవర్గం ఇన్చార్జి కే.యి శ్యాంబాబు ఆదేశాల మేరకు రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు,రేషన్ కార్డులు తొలగింపు,డీలర్ వ్యవస్థను నాశనం చేయడం,రేషన్ బియ్యం అక్రమ రవాణా వంటి విషయాలపై మండల టిడిపి నాయకులు నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా డీలర్ల వ్యవస్థను ప్రారంభించి,రేషన్ పంపిణీలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని మండల టిడిపి నాయకులు తుగ్గలి తహసిల్దార్ నిజాముద్దీన్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

 

 

రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి,రంజాన్ మరియు క్రిస్మస్ కానుకలను ప్రజలకు అందించాలని వారు డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యం తప్ప మరి సరుకులను పంపిణీ చేయడం లేదని వారు తెలియజేశారు. ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థను నిలిపివేసి,డీలర్ల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బత్తిన వెంకట రాముడు,మండల కన్వీనర్ తిరుపాల్ నాయుడు,మాజీ ఎంపీపీ కొమ్ము వెంకటేష్, ఈరమ్మ,టిడిపి నాయకులు వెంకటస్వామి, వెంకటరెడ్డి,మాభాష,లక్ష్మీ నారాయణ,మసాలా శీను,వెంకటేష్,కృష్ణయ్య,రామయ్య,మల్లి తదితర టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Tags: TDP is the state government that is destroying the dealer system

Leave A Reply

Your email address will not be published.