టీడీపీ అంటే తెలంగాణ దోఖా పార్టీ

TDP is the Telangana Dokha Party

TDP is the Telangana Dokha Party

Date:23/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
టీడీపీ అంటే తెలంగాణ దోఖా పార్టీ అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. కూటమి పేరుతో కాంగ్రెస్‌తో కలిసి మరోసారి కుట్రలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ప్రజలకు చంద్రబాబు ముక్త్ తెలంగాణ కావాలి.. రాష్ట్రంపై కుట్రలు చేసిన వ్యక్తితో ఎలా పొత్తు పెట్టుకుంటారంటూ కాంగ్రె‌స్‌ను ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన మురళీధర్ రావు.. కూటమి టార్గెట్‌గా మాటల తూటాలు పేల్చారు. తెలంగాణకు చంద్రగ్రహణం పట్టకూడదన్నారు మురళీధర్ రావు. రాష్ట్రంలో బాబు నిర్దేశించే రాజకీయాలు రావు.. రాకూడదన్నారు. ఆయన లేని రాజకీయాలు మాత్రమే ఉండాలన్నారు. కూటమి పేరుతో జనాల్లోకి వస్తున్న కాంగ్రెస్.. తెలంగాణ అభివృద్దికి, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కూడా దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యతిరేకులకు కోవర్టుగా మారిందన్నారు. తెలంగాణ ప్రజల్ని ఎదుర్కోలేక కాంగ్రెస్ మహా కూటమి తయారు చేసిందన్నారు మురళీధర్ రావు.
టీడీపీ అంటే తెలంగాణ దోఖా పార్టీ అని.. ఆ పార్టీతో కాంగ్రెస్ ఎలా కలుస్తుందని ప్రశ్నించారు. అందరూ చంద్రబాబు ముక్త్ తెలంగాణ కావాలని కోరుకుంటున్నారని.. అదే జరగాలని ఆశిస్తున్నాన్నారు.
కాంగ్రెస్‌ నేతలను బెంగళూరు, ఢిల్లీలో కలిసిన చంద్రబాబు.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక శక్తులతో కలిసి చేసే రాజకీయాలను కూడా ఎదిరిస్తామన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ విస్తరణకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నాంది అన్నారు మురళీధర్ రావు. నరేంద్ర మోదీ సర్కార్‌ తెలంగాణకు ఇచ్చిన నిధులను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఎన్నికల ప్రచారంలో మోదీ, అమిత్‌ షా పాల్గొంటారని.. జాతీయ ముఖ్య నేతలతో వందకు పైగా సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే మత ఆధారిత రిజర్వేషన్లకు ఎప్పటికీ వ్యతిరేకమేని.. నిజాం గులాంగిరిని, ఖాసీం రజ్వీ రాజకీయాలను బీజేపి వ్యతిరేకిస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వలేకే ముస్లింలతో ముడిపెడుతున్నారని విమర్శించారు.
Tags:TDP is the Telangana Dokha Party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *