టీడీపీ అవిశ్వాసమే అస్త్రం

TDP at work

TDP at work

Date:17/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పార్లమెంట్ వేదికగా కేంద్రంపై పోరాటానికి మరోసారి సిద్ధమయ్యింది టీడీపీ. విభజన హామీలు, ప్రత్యక హోదాపై ఉభయసభల్లో గళం విప్పాలని నిర్ణయంచింది. అందుకే ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మళ్లీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇవాళ సాయంత్రం లేదా బుధవారం ఉదయం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ ఎంపీలు. కేంద్రంపై ఒత్తిడి పెంచి ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఈసారి ఎలాగైనా అవిశ్వాసంపై చర్చకు పట్టుబడుతామని చెబుతున్నారు. కేంద్రం చేసిన అన్యాయంపై పార్లమెంట్లో పోరాటం చేస్తామన్నారు ఎంపీలు తోట నర్సింహం, సుజనా చౌదరి. కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు నోటీసులు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఈ అవిశ్వాసం వల్ల ప్రభుత్వం పడిపోతుందో లేదోకాని.. రాష్ట్ర సమస్యలతో పాటూ కేంద్రం చేసిన అన్యాయంపై చర్చ మాత్రం జరుగుతుందంటున్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో కూడా బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసేది లేదన్నారు. ఇతర పార్టీలేవైనా అభ్యర్థిని బరిలో పెడితే.. చంద్రబాబు ఆదేశాల మేరకు ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. అవిశ్వాస తీర్మానం, పార్లమెంట్ సమావేశాలపై ఎంపీ కేశినేని నాని కూడా స్పందించారు. అవిశ్వాస తీర్మానంతో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని. నోటీసుల్ని తిరస్కరిస్తే సభను స్తంభింపం చేస్తామన్నారు నాని. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే అవిశ్వాసంపై చర్చకు వెనకాడుతోందని.. ఒకవేళ చర్చకు వస్తే ఏపీకి చేసిన అన్యాయం ఎక్కడ బయటపడుతోందననే భయం వారిలో ఉందన్నారు. టీడీపీ ఎంపీలు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నేతల్ని కలిశారు. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని వివరించి.. పార్లమెంట్లో తాము చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరగా.. కొన్ని పార్టీలు మద్దతు కూడా తెలిపాయి. బుధవారం టీడీపీ అవిశ్వాసం కోసం నోటీసులు ఇస్తే కనుక.. పార్లమెంట్ సమావేశాలు వేడెక్కడం ఖాయం. మరో వైపు ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతున్న ఏపీ టీడీపీ ఎంపీలు.. ఒక్కో అడుగు ముందుకెస్తున్నారు. స్పెషల్ స్టేటస్ కోసం విపక్ష వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేయగా.. టీడీపీ ఎంపీలు మాత్రం కేంద్రం తీరును ఎండగడుతూ.. కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం తోట నర్సింహం నాయకత్వంలోని టీడీపీ ఎంపీలు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరిని కలిశారు. సీఎం రమేష్ ఆధ్వర్యంలో మరి కొందరు ఎంపీలు కనిమొళి, కుమారస్వామిలను కలిశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మద్దతు ఇవ్వాలని కోరారు. విభజన హామీల అమలు కోసం కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నంలో తమకు అండగా నిలవాలని కోరారు. ఇలా పార్టీల నేతలను కలుస్తూ పోతున్న టీడీపీ ఎంపీలు మంగళవారం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను పాట్నాలో కలిశారు. కేంద్రంపై పోరాటంలో తమకు సహకరించాలని చంద్రబాబు రాసిచ్చిన లేఖను ఎంపీలు గల్లా జయదేవ్, రవీంద్ర కుమార్, గరికపాటి మోహన్ రావులు లాలూకు అందజేశారు.
టీడీపీ అవిశ్వాసమే అస్త్రం https://www.telugumuchatlu.com/tdp-is-unbelief/
Tags:TDP is unbelief

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *