టిడిపి నేత  అమీర్ బాబు హౌస్ అరెస్ట్

కడప ముచ్చట్లు:


కడప కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం లో బాగంగా తెలుగు దేశం పార్టీ కడప నియోజకవర్గ ఇన్చార్జి వియస్ అమీర్ బాబు తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి బయలు దేరి వెలుతుండగా ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా అమీర్ బాబు మాట్లాడుతూ25 వ తేదీ ఉ.10 గం. లకు తాము అధిష్టానం ఆదేశాల మేరకు  ఉద్యోగాలు,DSC, స్టీల్ ప్లాంట్ లాంటి సమస్యల పరిష్కారం గురించి కలెక్టర్ కార్యాలయ ముట్టడికి బయలుదేరుతున్న సమయం లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, కార్మికులకూ ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెలుతుంటే ఆపడం శోచనీయమన్నారు. .అమిర్ బాబు  తన నివాసం లో  ఒన్ టౌన్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

 

Tags: TDP leader Aamir Babu under house arrest

Leave A Reply

Your email address will not be published.