సీఐడీ పోలీసులముందు హజరయిన టీడీపీ నేత గౌతు శిరీష
గుంటూరు ముచ్చట్లు:
టీడీపీ మహిళా నేత గౌతు శిరీషకు ఇచ్చిన నోటీసుల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మొదట ఇచ్చిన నోటీసు లో మంగళగిరి సీఐడీ రాష్ట్ర కార్యా లయంలో విచారణ కు రావాలని అధికారులు పేర్కొన్నారు.అయితే ఈ నేపథ్యంలో.. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి మంగ ళగిరి సీఐడీ కార్యాలయానికి బయలుదేరిన శిరీషకు మళ్ళీ సీఐడీ అధికారుల ఫోన్ చేసి.. మంగళగిరి కార్యా లయానికి కాకుండా గుంటూరు కార్యాలయం రండి అని సీఐడీ అధికారులు కోరారు. అయితే..గౌతు శిరీషతో పాటు సీఐడీ కార్యాలయానికి అనుచరులు చేరుకున్నా రు.ఈ క్రమంలో మంగళగిరి సీఐడీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో.. గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్ళాలని శిరీషకి పోలీసులు సూచించారు. అయితే.. తనకిచ్చిన నోటీసుల్లో మంగళగిరి సీఐడీ కార్యాలయమనే ఉంది కాబట్టి.. తానిక్కడే విచారణకు హాజరవుతానన్న శిరీష స్పష్టం చేశారు. చేసేదేం లేక శిరీషతో పాటు ఆమె తరు పు న్యాయవాదిని మాత్రమే పోలీసులు కార్యాలయం లోకి అనుమతించారు. ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ.. సోషల్ మీడియా పోస్టింగుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని, మహనాడు తర్వాత టీడీపీపై మరిన్ని వేధింపులు పెరిగాయని ఆమె ఆరోపించారు. ఫేక్ పోస్టింగులతో టీడీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మేం ఫిర్యాదులిచ్చినా పోలీసులు పట్టిం చుకోవడం లేదని మండిపడ్డారు.
Tags: TDP leader Gautham Sirisha appeared before the CID police

