బాధిత కుటుంబాలకు టీడీపీ నేత సహాయం
గన్నవరం ముచ్చట్లు:
గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో డయేరియా తో చనిపోయిన బాధిత కుటుంబాలకు గ టి.డి.పి.ఎం.ఎల్.సి బచ్చుల అర్జునుడు ఆర్దిక సహాయం అందించారు. ఆర్జునుడు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ఎప్పుడు అండగా టి.డి.పి పార్టీ వుంటుంది. సరైన వైద్యం లేక పోవటంతో మరణాలు సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. మెడికల్ క్యాంప్ నుంచి సరైన వైద్యం అందించలేక పోతున్నారు. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. 9 రోజులు వరకు వాటర్ లో బ్యాక్టీరియా వైరస్ వుందని చెప్పిన అధికారులు. ఆ నీరు తాగిన వారందరికీ ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించారు.ప్రజలు కూడా వైద్య అధికారులకి సహకరించాలి. కొంత మంది ప్రజలు టాబ్లెట్స్ వాడటం లేదని వైద్య అధికారులు చెప్పేరు. గ్రామంలో టి.డి.పి నాయకులు పర్యటించి అందరూ టాబ్లెట్స్ వాడేలా చర్యలు తీసుకుంటామని బచ్చుల అర్జునుడు అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగు పరిచేందుకు కలక్టర్ ద్రుష్టి సారించి ప్రత్యేక గ్రాంట్ ద్వార గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చెయ్యాలని కోరారు. ప్రభుత్వం స్పందించి డయేరియా తో చనిపోయిన బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం కింద 5 లక్షలు వెంటనే ఇవ్వాలని బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు.
Tags: TDP leader help the affected families