టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి పార్టీ మారే ఆలోచన

TDP leader Irigella Rampur Reddy thought the party would change

TDP leader Irigella Rampur Reddy thought the party would change

Date:01/01/2019
కర్నూలు ముచ్చట్లు:
పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ నియోజకవర్గంలో టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయన తన అనుచరవర్గంతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు అనుచరులు వెల్లడిస్తున్నారు. మొదట టీడీపీకి రాజీనామా చేసి ఆ తరువాత ఏ పార్టీలో చేరాలన్న విషయంపై నిర్ణయం తీసుకుందామని ఇరిగెల వర్గంలో అత్యధికులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.నియోజకవర్గంలో ఫ్యాక్షన్ ఉన్న సమయంలో తనకంటూ ఒక వర్గాన్ని కలిగిన ఇరిగెల రాంపుల్లారెడ్డి గంగుల కుటుంబం కంటే భూమా కుటుంబంపై ఎక్కువ వ్యతిరేకత కనబరిచేవారు. భూమా దంపతులు 2009లో పార్టీ వీడిన నాటి నుంచి టీడీపీలో ఉన్న ఇరిగెల రాంపుల్లారెడ్డి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంగుల ప్రభాకరరెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. అయినా గంగుల ఓటమిపాలయ్యారుఫ్యాక్షన్ గడ్డ ఆళ్లగడ్డలో ఒకనాడు ఇరిగెల రాంపుల్లారెడ్డి ఒక వర్గంగా కొనసాగారు.
భూమా నాగిరెడ్డికి వ్యతిరేకంగా రాంపుల్లారెడ్డి రాజకీయం నెరిపారు. 2009 ఎన్నికల్లో భూమా దంపతులు ప్రజారాజ్యం పార్టీలో చేరిన సందర్భంలో ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీ బాధ్యతలు తీసుకుని పార్టీ తరఫున పోటీ చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న భూమా, గంగుల కుటుంబాల వర్గపోరు దశాబ్దాల పాటు కొనసాగిన విషయం విదితమే. కాలక్రమంలో మార్పులు వచ్చి అందరూ ఫ్యాక్షన్‌కు స్వస్తి పలికి ప్రస్తుతం స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయాల్లో కొనసాగుతున్నారు.. వైసీపీ తరఫున పోటీ చేసిన అఖిలప్రియ గెలుపొందడంతో గంగుల ప్రభాకరరెడ్డి పార్టీ ఇన్‌చార్జిగా నియోజకవర్గ బాధ్యతలు నిర్వహించారు. అయితే ఎన్నికలైన రెండేళ్లకు నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో అఖిలప్రియ కూడా తండ్రి బాటను అనుసరించారు. దీంతో టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న గంగుల ప్రభాకరరెడ్డి ఇబ్బందులు పడ్డారు. కొద్దిరోజులకే ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. గంగుల పార్టీని వీడినా, భూమా వర్గంతో విభేదాలు ఉన్నా ఇరిగెల రాంపుల్లారెడ్డి మాత్రం టీడీపీలోనే కొనసాగారు.
ఆ సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు ఇరిగెలతో చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినా ఇంతవరకూ పట్టించుకోలేదని ఆయన వర్గం ఆగ్రహంతో ఉంది. ఎన్నికలు సమీపిస్తున్నా ఇరిగెల రాంపుల్లారెడ్డికి న్యాయం చేయకపోవడంతో ఇక పార్టీలో ఉండి ప్రయోజనం లేదని, అందుకే పార్టీ వీడాలన్న నిర్ణయానికి వచ్చారని సన్నిహితులు పేర్కొంటున్నారు. టీడీపీలో ఎదురవుతున్న ఇబ్బందులు, చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం వంటి అంశాలపై సమావేశంలో తన అనుచరులు, అభిమానులకు వివరించినట్లు తెలుస్తోంది. పార్టీలో గుర్తింపులేనప్పుడు కొనసాగాల్సిన అవసరం లేదని అంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇరిగెల పార్టీకి దూరమైతే టీడీపీకి ఇబ్బందులు తప్పవన్న చర్చ ప్రారంభం కాగా టీడీపీ నేతలు మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇరిగెల పార్టీ వీడినా టీడీపీ బలం ఒక్క శాతం కూడా తగ్గదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వీడే నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరినా ఇరిగెల పట్టించుకోలేదని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.
Tags:TDP leader Irigella Rampur Reddy thought the party would change

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed