Natyam ad

టీడీపీ నేత కిమిడి కళావెంకట్రావు హౌస్ అరెస్టు

శ్రీకాకుళం ముచ్చట్లు:


టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకట్రావు ను పోలీసులు  హౌస్ అరెస్ట్ చేసారు.   ఉమ్మడి శ్రీకాకుళంజిల్లా రాజాంలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు కళావెంకట్రావు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. విశాఖపట్నంలోని  ఋషికొండలో తవ్వకాలు, అక్రమ కట్టడాలకు నిరసనగా టీడీపీ పోరుబాట కార్యక్రమంనకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ముందస్తుగా ఇంటి వద్ద పోలీసులు మొహరించారు. శుక్రవారం తెల్లవారుజామునుంచి రాజాంలో అయన నివాసాన్ని చుట్టుముట్టారు.మరోవైపు,  విశాఖ లో హై టెన్షన్ నెలకొంది. గురువారం  రాత్రి నుండి టీడీపీ నేతలను  హౌస్ అరెస్ట్ లు చేసారు.  టీడీపీ కార్యాలయం  చుట్టూ భారీగా పోలీసులు  మోహరించారు. దశపల్లా హిల్స్, రుషి కొండ తదితర ప్రాంతాల్లో గురువారం నుండే పహారా కాస్తున్నారు. టీడీపీ నేతల పోరుబాటను అడ్డుకునేందుకు ముందస్తు చర్య లు  పొలీస్ లు చేపట్టారు.

 

Tags: TDP leader Kimidi Kalavenkatarao house arrested

Post Midle
Post Midle