Natyam ad

నల్లారికి శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నాయకులు

పీలేరు ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని పీలేరు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో, రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి అన్వర్ భాష హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం కిషోర్ కుమార్ రెడ్డి సొంత గ్రామమైన కలికిరిలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు. రానున్న ఎన్నికల్లో టిడిపి జనసేన కార్యకర్తలు నాయకులు సమిష్టి కృషితో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకొని రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని కిషోర్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి విజయమ్మ, గండికోట గణేష్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; TDP leaders congratulated Nallari

Post Midle