అమరావతి రైతులు కు సంఘీభావం ప్రకటించిన టీడీపీ నాయకులు

Date:22/10/2020

దర్శి  ముచ్చట్లు:

రాష్ట్ర రాజధాని అమరావతి గా ఉండాలని కోరుతూ గత 310 రోజులు గా  అమరావతి రైతులు చేస్తున్న నిరసన దీక్ష కుమద్దతు గా గురువారం ప్రకాశం జిల్లా  దర్శి లో స్థానిక ఎన్టీఆర్ పళ్ళెవనం పార్క్ దగ్గర ప్రకాశం జిల్లా టీడీపీ లేగెల్ సెల్ అధ్యక్షులు పరిటాల సురేష్ ఆధ్వర్యంలో  అమరావతి రైతులకు   సంఘీభావం ప్రకటించారు..ఈ సందర్భంగా  పరిటాల సురేష్ మాట్లాడుతూ, ఈ రోజు కి గౌరవ ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ సుమారు  5 సంవత్సరాల క్రితం అమరావతి లో రాజధాని ఏర్పాటు కు  శంఖుస్థాపన చేసి, మట్టి,  నీళ్లు తీసుకొచ్చి, ప్రపంచంలో నెంబర్  1 రాజధాని గా, తయారు చేయడానికి, అన్ని విధాలుగా సహకరిస్తాను అని చెప్పారు అని తెలిపారు. కానీ ఇప్పుడు వారు  మాట మార్చి వైసీపీ ప్రభుత్వం తో కుమ్మక్కు అవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతులు 310 రోజుల నుండి దీక్ష చేస్తుంటే కనీసం వారిని పట్టించు కోకుండా ఉండడం, పద్దతి కాదు అన్నారు.ఈ కార్యక్రమంలో  రాచపూడి మోషె,  చలమయ్య, దర్శి మాజీ  ఎంపీటీసీ నాగూర్, షైక్  ఖాసీం, పనిదపు బలరాం, గురవయ్య, తదితరులు  పాల్గొన్నారు.

చంద్ర‌ప్ర‌భ వాహ‌నంపై న‌వ‌నీత కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Tags: TDP leaders express solidarity with Amravati farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *