బాలయ్యను ప్రచారానికి ఆహ్వానించిన టీటీడీపీ నేతలు

TDP leaders invited to promote the boycott

TDP leaders invited to promote the boycott

Date:11/10/2018
గుంటూరు  ముచ్చట్లు:
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. హైదరాబాద్ సారథి స్టూడియోలో ఎన్టీఆర్ బయోపిక్ షూట్‌లో ఉన్న బాలయ్యతో పార్టీ అధ్యక్షుడు రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారానికి రావాలని బాలకృష్ణను కోరారు. వారి ఆహ్వానంపై బాలయ్య కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మరోవైపు సారథి స్టూడియోలో ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించి కీలక సన్నివేశాలను క్రిష్ తెరకెక్కిస్తున్నారట.
ముఖ్యంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించే సీన్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ సందర్భంలో పార్టీ సీనియర్ నేతలు రావుల, పెద్దిరెడ్డి ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బాలయ్యతో పంచుకున్నారట. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, కేవలం సినిమా షూటింగ్ ను చూడటానికే తాము ఇక్కడకు వచ్చామని తెలిపారు. రాజకీయాలపై బాలయ్యతో మాట్లాడలేదని చెప్పారు. బాలయ్యను చూస్తుంటే అచ్చం ఎన్టీఆర్ ను చూసినట్టే ఉందని అన్నారు. బాలయ్య నటిస్తుంటే ఎన్టీఆరే నటిస్తున్నట్టు అనిపిస్తోందని చెప్పారు. ‘ఎన్టీఆర్’ అండదండలతో రానున్న ఎన్నికల్లో విజయభేరి మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Tags:TDP leaders invited to promote the boycott

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *